• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎట్టకేలకు నష్టనివారణ...

ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి!

| డీఎంకే నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

By - Tupaki Desk
Update: 2023-09-14 08:50 GMT

సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాతో పోలుస్తూ .. దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు డీఎంకే ఎంపీ రాజా మరో అడుగు ముందుకేసి సనాతన ధర్మం హెచ్‌ఐవీ కంటే డేంజర్‌ అని వ్యాఖ్యానించి మరింత హీట్‌ పెంచారు.

డీఎంకే నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), కాంగ్రెస్‌ పార్టీలు.. ఉదయనిధి వ్యాఖ్యలు వ్యక్తిగతమని తేల్చిచెప్పాయి. అన్ని మతాలను గౌరవించడమే తమ విధానమని స్పష్టం చేశాయి.

ఉదయనిధి చేసిన వ్యాఖ్యల ప్రభావం వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఉదయనిధి తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నష్టనివారణ చర్యలకు దిగారు. సనాతన ధర్మంపై ఎవరూ మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచించారు. సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరారు.

బీజేపీ అవినీతినే లక్ష్యంగా చేసుకోవాలని డీఎంకే నేతలకు స్టాలిన్‌ సూచించారు. కేంద్ర పథకాలలోని అమలులో లోపాలపై స్పందించాలని చెప్పారు. సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని ఆయన తెలిపారు.

సనాతన ధర్మం అంశంపైనే తరచూ మాట్లాడటానికి కేంద్ర మంత్రులు నిత్యం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్‌ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తమ లోపాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. నేతలందరూ ఈ విషయాన్ని గమనించి సనాతన అంశానికి దూరంగా ఉండాలని స్టాలిన్‌ తమ పార్టీ నేతలకు సూచించారు.

మతపరమైన, నిరంకుశ బీజేపీ పాలనను అంతం చేయడానికి నడుం బిగించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని, హక్కులను కాపాడాలని కోరారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయన్నారు. వాటి ట్రాప్‌ లో చిక్కుకుని మతపరమైన వ్యాఖ్యలకు తావివ్వొద్దని కోరారు.

Tags:    
  • MKStalin 
  • TamilnaduCM 
  • Sanatandharma 
  • Tamilnadu 
  • Udainidhistalin 
  • DMK 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS