• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సంధ్య థియేటర్ వద్ద...

సంధ్య థియేటర్ వద్ద దారుణం... ‘పుష్ప-2’ తొక్కిసలాటలో మహిళ మృతి!

| ఈ సమయంలో.. సంధ్య థియేటర్ వద్ద ఓ విషాదం చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-12-05 04:25 GMT

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా "పుష్ప-2" సందడి నెలకొందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో సుకుమార్ మార్క్ టేకింగు, బన్నీ యాక్టింగు, ఫైట్లు, డ్యాన్స్ లు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాయి. ఐకాన్ స్టార్ విశ్వరూపం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో.. సంధ్య థియేటర్ వద్ద ఓ విషాదం చోటు చేసుకుంది.

అవును... ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప-2 గురించిన చర్చే జరుగుతుంది. ఈ సమయంలో హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన వేడుకలు ప్రత్యేకంఆ నిలిచాయి. ఈ థియేటర్ లో తన అభిమానులతో కలిసి ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. దీంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ థియేటర్ వద్ద గుమిగూడారు.

ఈ సమయంలో అల్లూ అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో... వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కిందపడిపోయారు.

ఆ భారీ తొక్కిసలాటలో జనం కాళ్ల మధ్య నలిగిపోయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో సృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. అనంతరం హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు.

మరోపక్క కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో... అతడిని నిమ్స్ కు తరలించారు. ఆ బాలుడి పరిస్థితిపై అప్ డేట్ రావాల్సి ఉంది. ఈ సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు రాగా.. తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు.

వారిలో తల్లి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే క్రమంలో మరి కొంతమంది స్వల్పంగా గాయపడ్డట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్ కానీ, థియేటర్ యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు!

థియేటర్ వద్ద తొక్కిసలాట.. బాలుడి పరిస్థితి విషమం

'పుష్ప-2' ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా రావడంతో ఓ థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్నవారు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు.

అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు… pic.twitter.com/N3TdT6BE1y

— Tupaki (@tupaki_official) December 4, 2024
Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Rashmika 
  • Pushpa2premier 
  • Bhaskar 
  • Tej 
  • Sanvi 
  • Durgabhaideshmukhhospital 
  • Sandhyatheatre 
  • RTCcrossroads 
  • Tollywood 

Similar News

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

Copyright @2026

Powered by Blink CMS