'ద‌క్షిణాది'ని దారితెచ్చుకున్నారా?!

అంతేకాదు.. న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటే కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోద‌ని కూడా చెప్పారు.

Update: 2026-08-21 17:30 GMT

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న విష‌యంలో ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న ద‌క్షిణాది రాష్ట్రాల‌ను కేంద్రం మెత్త బ‌డేలా చేసిందా? నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లు కొంత మేర‌కు స్వ‌రం స‌రిచేసుకున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా చెన్నైలో జ‌రిగిన ద‌క్షిణ ప్రాంత స‌ద‌స్సు(స‌ద‌ర‌న్ జోన‌ల్ కాన్ఫ‌రెన్స్‌)లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఈ విష‌యా న్ని ప్ర‌స్తావించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాదికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని పేర్కొన్నారు.

అంతే కాదు.. న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటే కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోద‌ని కూడా చెప్పారు. దీంతో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాలు ఈ విష‌యం కొంత మేర‌కు మెత్త‌బ‌డిన‌ట్టు తెలిసింది. దీంతో నియో జ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంలో త‌మిళ‌నాడు.. ప్ర‌స్తుతం ఉన్న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిని ధ్యం విష‌యంలో త‌మ రాష్ట్రానికి న‌ష్టం చేయ‌కుండా చూడాల‌ని కోరుతూ.. సీఎం విజ‌య్ కేంద్రానికి లేఖ రాశారు. అదేవిధంగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సైతం.. త‌మకు న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌న్నారు.

ఇక‌, కేర‌ళ‌, ఏపీలు పార్ల‌మెంటు పున‌ర్విభ‌జ‌న‌కు రెడీగా ఉన్నాయి. తెలంగాణ మాత్రం ఈ విష‌యంపై ఇప్ప‌టికీ మౌనంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆది నుంచి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్న ద‌క్షిణాది రాష్ట్రాలు దారిలో ప‌డ్డాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా పార్ల‌మెంటులో ఈ బిల్లును ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. వాస్త‌వానికి పార్ల‌మెంటు స‌మావేశాలు ఇప్ప‌టికే ముగిశాయి. ఈ నెల 13తోనే వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిసిపోయాయి.

కానీ, పార్ల‌మెంటును ప్రోరోగ్‌(పూర్తిస్థాయి వాయిదా) చేస్తూ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు జారీ చేయ‌లేదు. అంటే.. ఎప్పుడైనా మ‌రోసారి పార్ల‌మెంటును కొలుదీర్చే అవ‌కాశం ఉంది. వ‌చ్చే స‌మావేశాల నాటికి.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న బిల్లును ఆమోదించుకుని.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ను దీనికి అనుసంధానం చేయాల‌ని కేంద్రం భావిస్తున్న ద‌రిమిలా.. పార్ల‌మెంటు స‌మావేశాలు వ‌చ్చే వారంలో ఉండే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Tags:    

Similar News