సిట్ నివేదికలో సంచలన విషయాలు ?

రెండు రోజుల పాటు సంఘటనా స్థలాలకు వెళ్ళి మరీ అక్కడ మొత్తం పరిస్థితిని వాకబు చేసి సమీక్షించి రూపొందించిన ప్రాధమిక నివేదికగా దీనిని చూస్తున్నారు.

Update: 2024-05-20 14:38 GMT

ఏపీలో పోలింగ్ రోజున అనంతరం జరిగిన అల్లర్ల మీద ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ తన నివేదికను డీజీపీకి అందచేసింది. ఇది మధ్యంతర నివేదిక. రెండు రోజుల పాటు సంఘటనా స్థలాలకు వెళ్ళి మరీ అక్కడ మొత్తం పరిస్థితిని వాకబు చేసి సమీక్షించి రూపొందించిన ప్రాధమిక నివేదికగా దీనిని చూస్తున్నారు.

సిట్ నివేదికలో ఏమి ఉంది అన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. సిట్ నివేదిక దాదాపుగా 150 పేజీలతో రూపొందించారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నివేదికలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పోలింగ్ రోజు అనంతరం ఏకంగా 33కి పైగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు అని తెలుస్తోంది.

అదే విధంగా చూస్తే కనుక ఇందులో ఒక్క పల్నాడులోనే 22 కేసులు అలాగే తాడిపత్రిలో ఏడు కేసులు, తిరుపతిలో నాలుగు కేసులు నమోదు అయినట్లుగా సిట్ నివేదికలో ఉంది. ఇక టోటల్ గా చూస్తే 33కి పైగా జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 1,370 మందిని నిందితులుగా సిట్ చేర్చింది. అది నివేదికలో ఉంది.

ఇక అరెస్టుల విషయం తీసుకుంటే ఇప్పటిదాకా 124 మందిని అరెస్ట్ చేసినట్లుగా సిట్ వెల్లడించింది. మిగిలిన వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తామని పేర్కొంది అని అంటున్నారు. ఇక సిట్ నివేదిక లో కీలక అంశాలే ఉన్నాయని అంటున్నారు.

Read more!

ఎక్కడైంతే సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయో అలాగే ఘర్షణలకు అవకాశం ఉందని భావిస్తున్నారో అక్కడ కొందరు అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని అంటున్నారు. ఈ విషయం సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అంతే కాదు కొంతమంది పోలీసు అధికారులు సైతం ఉదాశీనంగా వ్యవహరించారని దాని వల్లనే హింస మరింత పెరిగింది అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యమో నిందితులకు ఉపయోగించే కొన్ని సెక్షన్లతో పాటు కొందరు కీలకమైన అధికారుల విషయంలో చర్యలకు కొత్త సెక్షన్లు కూడా చేర్చాలని సిట్ సిఫార్సు చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఘర్షణల విషయంలో అధికారుల ఉదాశీనత కూడా ఉందని సిట్ నివేదికలో పేర్కొన్నారు అన్నది ఇపుడు ప్రచారంలో ఉంది. దీంతో సంచనల పరిణామాలు రానున్న రోజులలో చోటు చేసుకుంటాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ మధ్యంతర నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. తదుపరి ఆదేశాలను ఈసీ ఏ విధంగా ఇస్తుంది అన్నది చూడాలి. అంతే కాదు సిట్ పూర్తి స్థాయి నివేదిక కోసం గడువు కోరుతోంది. దానికి ఎంత సమయం గడువు ఈసీ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే కొందరు అధికారులతో పాటు వివిధ రాజకీయ నేతల ప్రమేయం కూడా ఈ అల్లర్ల వెనక ఉందన్నది సిట్ ప్రాధమిక నివేదికలో ఉండడంతో రానున్న రోజులలో జరిగే అరెస్టులు సంచలనం సృష్టిస్తాయా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News