• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీనే తలచుకుంటూ...రాహుల్...

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

| ప్రధాని మోదీ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా ఖండించారు. మోదీ అలాంటి పని చేస్తారని తాను నమ్మడం లేదని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే సొంత పార్టీ నేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

By - Satya P
Update: 2026-11-15 03:42 GMT

కాంగ్రెస్ అగ్ర నేత నరేంద్ర మోడీ పైన నిప్పులు కురిపిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా మోడీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు అన్నీ అందులోనే ఉన్నాయని ఆయన భావిస్తూ దేశ ప్రధాని మీద విరుచుకుపడుతున్నారు. నిజానికి దేశంలో ఎన్నో అంశాల మీద ఫోకస్ పెట్టి పోరాటాలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాతో పనిచేస్తోందా అన్న చర్చ కూడా వస్తోంది. మోడీని విమర్శించకూడదని ఎవరూ అనడం లేదు, కానీ అదే ఎక్కువైపోతే కాంగ్రెస్ వ్యూహం బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు. ఇక మోడీ మీద అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన రాహుల్ గాంధీ లేటెస్ట్ గా తన ఫోన్లను మోడీ ట్యాప్ చేస్తున్నారు అని సీరియస్ గానే కామెంట్స్ చేశారు. నిజానికి ఇది అత్యంత తీవ్రమైన విమర్శ. అయితే అది ఎంత మేరకు పేలింది, జనాలలో ఏ మేరకు రీచ్ అయింది అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ కే రివర్స్ అయిందా అన్న చర్చ వస్తోంది. దానికి కారణం అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా చేసిన కీలక వ్యాఖ్యలు అని చెప్పాలి.

ప్రధాని ఆ పని చేయరు :

మోడీ ప్రధాని పదవిలో ఉన్నారు. ఆయన ఫోన్లు ట్యాప్ చేస్తారు అని తాను అనుకోవడం లేదని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా తాజాగా స్పష్టం చేశారు. ఆయన ముందు ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రధాని హోదాలో దృష్టి సారించాల్సిన అంశాలు అనేకం ఉంటాయని శ్యామ్ పిట్రోడా చెప్పుకొచ్చారు. అటువంటి ప్రధాని కేవలం రాజకీయాల కోసం కొందరిని టార్గెట్ గా చేసుకుని ఫోన్లు ట్యాప్ చేస్తారు అని తాను అయితే భావించడం లేదు, నమ్మడం లేదు అని శామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. తనకు దానికి గల కారణాలు ఏమిటి అన్నది కూడా కనిపించడం లేదని అన్నారు. నిజాయతీగా చెప్పాలీ అంటే తనకు మోడీ ఫోన్లు ట్యాప్ చేస్తారు అని ఎప్పుడూ అనిపించనే లేదని అన్నారు.

రాహుల్ ని షాకింగ్ గా :

తన ఫోన్లు కేంద్రం ట్యాప్ చేస్తోంది అని రాహుల్ తీవ్రంగా ఆరోపించి ఇరవై నాలుగు గంటలు కూడా కాకుండానే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత శామ్ పిట్రోడా ఎన్డీటీవీ కథనం ప్రకారం ఒక ఇంటర్వ్యూలో పూర్తిగా ఖండించే ధోరణిలో మాట్లాడటం రాహుల్ కి భారీ షాక్ నే ఇచ్చింది అని అంటున్నారు. రాహుల్ అభిప్రాయాలతో శామ్ పిట్రోడా విభేదించడం ఇపుడు ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యల మీద అయితే శామ్ పిట్రోడా స్పందిస్తూ తాను రాహుల్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందని అన్నారు. అయితే కొన్ని అంశాల్లో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం అని చెప్పుకొచ్చారు.

వ్యూహాలు గతి తప్పి :

ఇదిలా ఉంటే మోడీ విదేశీ శక్తులకు లొంగిపోయారు అని కూడా మరో విమర్శ రాహుల్ చేశారు. మోడీ విదేశీ శక్తులకు లొంగిపోయారు అన్న మాటలను అయితే దేశ జనాభాలో అత్యధికులు ఎవరూ నమ్మరని అంటున్నారు. మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు ఆయన భావాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే అని గుర్తు చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సొంత పార్టీ నేత శామ్ పిట్రోడా ఇచ్చిన షాక్ తో రాహుల్ మోడీ మీద చేస్తున్న కామెంట్స్ రాజకీయ పరమైనవేనా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక తెల్లారి లేస్తే చాలు మోడీనే తలచుకుంటూ రాహుల్ చేస్తున్న కామెంట్స్ విమర్శలలో పస తగ్గి పదనిసలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాంతో రాహుల్ వ్యూహాలు గతి తప్పి చతికిల పడుతున్నాయా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.

Tags:    
  • rahulgandhi 
  • shampitroda 
  • narendramodi 
  • modi 
  • congress 
  • phonetapping 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS