దేనికైనా షేక్ హసీనా రెడీ ...బంగ్లా పాలకులకు కొత్త సవాల్
షేక్ హసీనా. పోరాట యోధురాలు. తూర్పు పాకిస్తాన్ ని ఒక సొంత దేశంగా ఆత్మగౌరవం కలిగిన భూభాగంగా మార్చి బంగ్లాదేశ్ ఆవిష్కరణకు కారకుడు అయిన బంగ్లా జాతిపిత ముజఫర్ రెహమాన్ కుమార్తె.
షేక్ హసీనా. పోరాట యోధురాలు. తూర్పు పాకిస్తాన్ ని ఒక సొంత దేశంగా ఆత్మగౌరవం కలిగిన భూభాగంగా మార్చి బంగ్లాదేశ్ ఆవిష్కరణకు కారకుడు అయిన బంగ్లా జాతిపిత ముజఫర్ రెహమాన్ కుమార్తె. తండ్రి మాదిరిగా ఉద్యమ స్ఫూర్తి షేక్ హసీనాలో అతి ముఖ్య నాయకత్వ లక్షణం. అందుకే ఆమె బంగ్లాదేశ్ ని సుదీర్ఘంగా పాలించారు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల నేపధ్యంలో 2024 ఆగస్టు నెలలో ఆమె భారత్ కి రావాల్సి వచ్చింది. ఆనాటి విద్యార్థి ఉద్యమాల వెనక కుట్ర ఉందని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఆ దేశంతో పాటు విదేశీ శక్తులు కృషి చేశాయని అంతర్జాతీయ సమాజానికి అప్పటికే అర్ధం అయింది. అయితే వేడి చల్లారే వరకు వేరే చోట ఉండడమే మేలు అన్న రాజనీతితోనే ఇన్నాళ్ళూ షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఇపుడు చూస్తే ఆమె తన సొంత దేశం వెళ్ళాలని చూస్తున్నారు.
జైలుకైనా వెళ్తా :
ఇది లేటెస్ట్ గా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బిగ్ స్టేట్మెంట్. ఇచ్చారు. తాను బంగ్లా దేశ్ వెళ్తే జైలులో పెట్టినా రెడీ అని అంటున్నారు. తన మీద పెట్టిన కేసులు కానీ ఉరి శిక్ష విధించడం కానీ అన్నీ రాజకీయంగా ప్రేరేపితం అని ఆమె అంటున్నారు. తాజాగా ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనసులో అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్ లో ఉంటాను అని ఖండితంగా ఆమె చెబుతున్నారు. తాను బంగ్లాదేశ్ వెళ్ళడం అన్నది శాంతియుతంగా చట్టబద్ధంగా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే తాను బంగ్లాదేశ్ వెళ్లే విషయం మీద ఇటు భారత్ ప్రభుత్వంతో కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కానీ అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చర్చించలేదని ఆమె చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వం :
ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ని ఏలుతున్న ప్రభుత్వాన్ని షేక్ హసీనా ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం అని అన్నారు. ఇక తనకు ఉరి శిక్ష విధిస్తూ 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని షేక్ హసీనా పూర్తిగా తప్పు పట్టారు. అది రాజకీయ ప్రోత్సాహంతో ఇచ్చిన తీర్పుగా విమర్శించారు. ఇది దారుణమైన తీర్పు అన్నారు. తన పైన విచారణ జరిపించడం కూడా అక్కడి పాలకుల రాజకీయాల్లో భాగం అన్నారు. అయితే తాను మాత్రం తగ్గేది లేదని ఆమె అంటున్నారు. బంగ్లాదేశ్ కి వెళ్ళి తీరుతాను అని రాజకీయంగానే అన్నీ ఎదుర్కొంటాను అని ఆమె చెబుతున్నారు.
అవామీ లీగ్ పునరుద్ధరణ :
ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీని అక్కడ నిషేధించింది. దాంతో ఆ పార్టీని తిరిగి పునరుద్ధరిస్తాను అని షేక్ హసీనా చెబుతున్నారు. అంతే కాదు తన సొంత గడ్డ బంగ్లాదేశ్ లో ప్రజాస్వామిక పాలనను తిరిగి తీసుకుని వస్తాను అని చెబుతున్నారు. తాను లేని అవామీ లీగ్ పాలన లేని బంగ్లాదేశ్ దారుణంగా ఉందని ఆమె విమర్శించారు. అక్కడ ఉగ్రవాద తీవ్ర వాద శక్తుల ప్రభావం అధికంగా ఉందని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్ లో ఉగ్రవాదం పెచ్చరిల్లితే అది కేవలం ఆ దేశం సమస్యగానే ఉండదని ప్రాంతీయ ముప్పుగా పరిణమిస్తుంది అని షేక్ హసీనా అంటున్నారు