• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ష‌ర్మిల‌కు ఇప్పుడు...

ష‌ర్మిల‌కు ఇప్పుడు అస్స‌లు బాధ‌ లేదా ..!

| త‌మ‌ను `వేరే` మ‌హిళ‌ల‌తో పోల్చి మాట్లాడ‌డంపై ఇక్క‌డి మ‌హిళ‌లు తీవ్ర‌స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తు న్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-09 03:30 GMT

మ‌హిళ‌ల‌ను ఎవ‌రు కించ ప‌రిచినా ఊరుకునేది లేదంటూ..కొన్నాళ్ల కిందట శ‌ప‌థం చేసి.. క‌న్నీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డ ఉన్నారు? అంటే.. స‌మాధానం ల‌భించ‌డం లేదు . ఒక‌వైపు రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై జ‌గ‌న్ మీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లు నిప్పులు కురిపిస్తున్నాయి. మ‌హిళ‌లు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. ఇదేం ప‌ద్ధ‌తి అంటూ.. నిల‌దీస్తున్నా రు. అంతేకాదు.. జ‌గ‌న్ కుటుంబం కూడా.. అమ‌రావ‌తి ప‌రిధిలోనే ఉంద‌ని వ్యాఖ్యానించారు.

త‌మ‌ను `వేరే` మ‌హిళ‌ల‌తో పోల్చి మాట్లాడ‌డంపై ఇక్క‌డి మ‌హిళ‌లు తీవ్ర‌స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తు న్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఒక పార్టీకి మ‌హిళా నాయ‌కురాలిగా ఉన్న ష‌ర్మిల క‌నీసం ఇప్ప‌టి వర కు స్పందించ‌క‌పోవ‌డంపై అంద‌రూ నివ్వెర పోతున్నారు. త‌ర‌చుగా త‌న సోద‌రుడు జ‌గ‌న్‌ను టార్గెట్ చేసే ష‌ర్మిల‌... కేవ‌లం తన సొంత లాభ‌మే చూసుకుంటారా? అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంటే.. త‌న‌కు నొప్పి క‌లిగితే ఒక‌ర‌కంగా.. వేరేవారికి నొప్పి క‌లిగితే ప‌ట్టించుకోరా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

``ఇదేం ప‌ద్దతి. మ‌హిళగా ఆమె మాకు మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోయినా ఫ‌ర్లేదు. క‌నీసం.. జ‌రిగిన దానిని ఖండించా లి క‌దా!`` అని రాజ‌ధాని ప్రాంత మ‌హిళా రైతులు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రు.. ఇప్పుడు క‌ష్టంలో ఉన్న‌వారిని క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు కూడా ష‌ర్మిల రాలేద‌ని.. రేపు ఏ మొహం పెట్టుకుని వ‌స్తార‌ని .. ప్ర‌శ్నించారు. ఇది వాస్త‌వం. మ‌హిళ‌గా.. మ‌హిళా నాయ‌కురాలిగా.. ష‌ర్మిల పుంజుకునేందుకు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునే విష‌యంలో త‌డ‌బ‌డుతూనే ఉన్నారు.

గ‌తంలోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించారు. విజ‌య‌వాడ వ‌ద‌ర‌ల స‌మ‌యంలో ఆమె క‌న్నెత్తి కూడా అటు చూడ‌లేదు. కానీ.. ఏలూరులో ఎర్ర‌కాలు పొంగి.. పొలాలు కొంత వ‌ర‌కు మునిగితే అక్క‌డ‌కు వెళ్లారు. దీనికి కార‌ణం.. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ఢిల్లీలో ధ‌ర్నా పెట్టారు. దీనిని టార్గెట్ చేయ‌డం కోసం.. ఆమె ఏలూరు వెళ్లార‌న్న చ‌ర్చ కూడా జ‌రిగింది. ఇప్పుడు కూడా.. మ‌హిళ‌ల‌కు క‌నీసం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఉంటే బాగుండేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మ‌హిళా రైతుల‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

Tags:    
  • WomenDeserveRespect 
  • AmaravatiWomen 
  • WhereIsSharmila 
  • PoliticalAccountability 
  • AndhraPolitics 
  • YSSharmila 
  • SupportWomenFarmers 
  • RespectWomenVoices 
  • Yssharmia 

Similar News

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!

2026-11-02 03:59 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS