టీచర్స్ ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం!

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల కోటాలో శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Update: 2023-12-15 10:17 GMT

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల కోటాలో శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే కన్ను మూశారు. అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనలో ఆయన పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళ్తూండగా ఆయన కారుని ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్సీ కారు నుజ్జు అయింది. ఆయనకు తీవ్ర గాయాలు తగిలాయి. ఆయనను వైద్యం కోసం వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తూండగానే మార్గమధ్యలోనే చనిపోయారు. ఇక ఆయనతో పాటు ఆ కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండ్గా రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతూండగా సాబ్జీ మరణ వార్త తెలియడంతో ముఖ్యమంత్రి సహా మంత్రులు అంతా రెండు నిముషాల పాటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు. సాబ్జి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News