షాకింగ్ ఆడియో... "ఒప్పుకుంటే"జాబ్ ఇప్పిస్తా.. లేదంటే లేదు'!

ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ ఫోన్ కు కాల్‌ వచ్చిందని చెబుతున్నారు.;

Update: 2025-07-22 17:47 GMT

గత ప్రభుత్వ హయాంలో లైంగిక వేదింపులకు సంబంధించిన కొన్ని వీడియోలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! ఇప్పటికీ వాటికి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతుంటాయి! ఈ క్రమంలో తాజాగా శానిటేషన్ వర్క్స్ చేసే ఓ మహిళకు ఇటీవల ఉద్యోగం పోగా... మరళా ఉద్యోగం కావాలంటే "నువ్వే కావాలి.. డబ్బులు వద్దు" అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్‌ వర్కర్‌ గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్‌ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్‌ అలియాస్ చింటు.. ఉద్యోగం నుంచి తొలగించాడని చెబుతున్నారు. ఆమె ఉద్యోగం కోసం అనేక మార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అంటున్నారు!

ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ ఫోన్ కు కాల్‌ వచ్చిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా... తాను సహాయం చేస్తానని చెబుతూ, తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు! అయితే తనతో పాటు చింటుకు "నువ్వు కావాలి" అని సదరు వ్యక్తి అడిగాడని వైసీపీ ఘాటుగా విమర్శించింది. ఈ మేరకు వైసీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.

ఈ సమయంలో... ఆ టీడీపీ కార్యకర్త కాల్ కు స్పందించిన మహిళ... తాను అలాంటి దానిని కాదని, డబ్బులు కావాలంటే ఇస్తానని చెప్పారు. అయితే... ‘డబ్బు వద్దు’ అని చెబుతూ.. ‘ఒప్పుకుంటే ఇప్పిస్తా.. లేదంటే లేదు’ అని తేల్చి చెప్పాడు సదరు వ్యక్తి! అయితే... ఈ ఘటన సుమారు వారం క్రితమే జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!

Full View
Tags:    

Similar News