అబ్బాయిలకు ’రూమర్ గర్ల్ ఫ్రెండ్’.. ఇప్పుడు ఇదొక ట్రెండ్

‘రూమర్ గర్ల్ ఫ్రెండ్’ అనేది ఇప్పుడు వస్తున్న కొత్త పదం. ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ అనే సరిపెట్టేవారు.;

Update: 2025-04-09 16:30 GMT

‘‘ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’’ ఇది తెలుగులో పాపులర్ సామెత.. ఏమీ లేకుండా గాలిలో మేడలు కట్టడమే దీని అర్ధం.. అసలు పెళ్లే కాలేదు.. అంతలోనే గర్భం.. ఆపై అబ్బాయి పుట్టడం.. అతడి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించడాన్ని ఇలా వర్ణించేవారు.

ఇప్పుడు కాలం మారింది కదా..? మనం తెలుగు పాపులర్ సామెతను కూడా మార్చి చెప్పుకోవాలేమో..? ఎందుకంటే.. వారిద్దరూ ప్రేమికులో కాదు తెలియదు.. ఇష్టపడ్డారో లేదో తెలియదు.. భవిష్యత్ లో పెళ్లిచేసుకుంటారో లేదో తెలియదు.. కానీ, ఆమె అతడి గర్ల్ ఫ్రండ్ అనేస్తున్నారు. దీనికిముద్దుగా ‘రూమర్ గర్ల్ ఫ్రెండ్’ అని పేరు పెట్టేశారు.

సెలబ్రిటీల్లోనే..

‘రూమర్ గర్ల్ ఫ్రెండ్’ అనేది ఇప్పుడు వస్తున్న కొత్త పదం. ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ అనే సరిపెట్టేవారు. లేదా బాయ్ ఫ్రెండ్ అనేవారు. అదేంటో ..? ఎవరు పెట్టారో? రూమర్ గర్ల్ ఫ్రెండ్ అనే పదం తీసుకొచ్చారు.

కాగా, ధనశ్రీ వర్మతో ఇటీవల విడిపోయిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు కథనాలు రాస్తున్నారు. ఆమె మహ్ వశ్. రేడియో జాకీ అయిన మహ్ వశ్.. 'అతడే నాకు అన్నీ' అంటూ ఇటీవల ఓ వీడియోలో పేర్కొంది. దీనికి చాహల్ లైక్ కొట్టాడు.

రెండేళ్ల కిందట భార్యతో విడిపోయిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలోనూ రూమర్ గర్ల్ ఫ్రెండ్ అనే మాట వినిపిస్తోంది. సోఫీ షైన్ అనే ఐర్లాండ్ అమ్మాయిని ధావన్ ఇష్టపడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఫాలో చేసుకోవడం, చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కలిసి కనిపించడంతో ధావన్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఈమెనే అని అంటున్నారు. నాకో ప్రేయసి ఉంది అని గతంలో ధావన్ అనడంతో ఆ ప్రేయసి సోఫీనే అని తేల్చేస్తున్నారు నెటిజన్లు.

ఇక టీమ్ ఇండియాకు రేపో మాపో కెప్టెన్ కాబోతున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూ ఓ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఉందట. ఆ యువతి పేరు మ్యాడీ హామిల్టన్. ఈమెతో కలిసి ఇటీవల దిగిన సెల్ఫీని జైశ్వాల్ పోస్ట్ చేశాడు.

సినీరంగంలోనూ ఇలాంటి రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఉన్న స్టార్లు ఉన్నారు. అది ఎవరో కాదు.. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండనే. తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన, నేషనల్ క్రష్ రష్మికనే ఆ రూమర్ గర్ల్ ఫ్రెండ్. వీరిద్దరూ తాజాగా ఓ ఐలాండ్ కు వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్-రష్మిక బంధం గురించి వారిద్దరూ ఏనాడూ నోరిప్పలేదు.

మరి రూమర్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా??

ఇక్కడా పురుషాధిక్యమే అన్నట్లు రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు రూమర్ బాయ్ ఫ్రెండ్ గా ఎవరి పేరూ తెరపైకి రావడం లేదు. సెలబ్రిటీలకు సంబంధించి ఒకవేళ వచ్చినా స్నేహితుడు అనే అంటున్నారు తప్ప రూమర్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం లేదు మీడియా. మహిళలకు సంబంధించి గౌరవ మర్యాదలు పాటించాలనే ఉద్దేశం కాబోలు. ఏదైతేనేం.. ప్రస్తుత కాలంలో రూమర్ గర్ల్ ఫ్రెండ్ బాగా ట్రెండ్ అవుతోంది.

Tags:    

Similar News