• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎవరు బాబు నువ్వు.. మా...

ఎవరు బాబు నువ్వు.. మా స్టైలిష్ స్టార్ కంటే తోపులా ఉన్నావ్.. ఎం లక్కీరా బై..

| మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల బాలుడు రుద్రాన్ష్ సింగ్ ఠాకూర్ తన సీరియస్ లుక్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అతని వీడియో చూసిన యవత్మాల్‌కు చెందిన సాయి పాయింట్ హోండా షోరూమ్ యజమాని దిలీప్ బొబాడే పాటిల్.. కేజీ-1 నుంచి డిగ్రీ వరకు చదువు ఖర్చులన్నీ భరిస్తానని ప్రకటించారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసం వైరల్ కావాల్సిన పరిస్థితి రావడంపై చర్చ జరుగుతోంది.

By - A.N.Kumar
Update: 2026-11-16 18:58 GMT

సోషల్ మీడియాలో ఒక రీల్ పడితే చాలు.. ఫాలోవర్లు, లైకులు, వ్యూస్ అన్నీ వాటంతట అవే క్యూ కడతాయి. కానీ అవేవీ లేని రెండేళ్ల బుడ్డోడు మాత్రం ఏకంగా మన స్టైలిష్ స్టార్ ను మించి సీరియస్ లుక్ లో తన జేబులో తన చేయిలు పెట్టుకొని వైరల్ అయ్యాడు. ఆ ఒక్క లుక్ ఈ బుడ్డోడిని ఎక్కడికో తీసుకెళ్లింది.. అంతే.. తన డిగ్రీ వరకు చదువు ఖర్చులన్నింటినీ ఫ్రీగా సెటిల్ చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన రుద్రాన్ష్ సింగ్ ఠాకూర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాడు.

తండ్రి కొత్త బండి కొన్న ఆనందంలో కెమెరా ముందు ఈ బుడ్డోడు ఇచ్చిన పోజులు.. గంభీరమైన ముఖ కవళికలు.. అచ్చం పెద్ద హీరోలా చూసిన చూపు చూస్తే నవ్వుకోవాలో.. ముద్దుపెట్టుకోవాలో అర్థం కాదు. ‘భోండు బచ్చా’, ‘వైరల్ ఆరా కిడ్’ అంటూ నెటిజన్లు అతనికి రకరకాల పేర్లు కూడా పెట్టేశారు. ఇంకేముంది వీడియో క్షణాల్లో వైరల్ అయింది.. కోట్లాది వ్యూస్ వచ్చాయి.

అయితే అసలు సినిమా ఇక్కడే మొదలైంది. మన దేశంలో ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలు ఫీజులు కట్టలేక పుస్తకాలు మూసేస్తుంటే.. ఈ బుడ్డోడి వైరల్ వీడియో మాత్రం ఓ వ్యాపారవేత్త కంట్లో పడింది. యవత్మాల్‌కు చెందిన సాయి పాయింట్ హోండా షోరూమ్ యజమాని దిలీప్ బొబాడే పాటిల్ వెంటనే రంగంలోకి దిగారు. కేజీ-1 నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు ఆ చిన్నారి చదువు ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ప్రకటించారు.

ఇక్కడ అసలైన సెటైర్ ఏంటంటే.. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి జీవితాంతం ఆఫీసులు.. షిఫ్టుల్లో కష్టపడిపోతుంటారు. కానీ ఈ తరం పిల్లలు ఏకంగా రెండేళ్ల ప్రాయంలోనే కెమెరా ముందు ఒక ఫోటో ఇస్తే చాలు.. చదువు ఖర్చులు సెట్ అయిపోతున్నాయన్నమాట.. భవిష్యత్తులో తల్లిదండ్రులు పిల్లలతో హోంవర్క్ చేయించడం మానేసి "ఈరోజు రీల్స్ ఏం చేద్దాం?" అని ట్యూషన్ పెట్టాల్సి వస్తుందేమో.. హతవిధీ.. అంతే మరీ..

ప్రతిభకు గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఓ చిన్నారి తన భవిష్యత్తును సెక్యూరిటీ చేసుకోవాలంటే సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందేనా? అనే ప్రశ్న కూడా ఇక్కడ పెద్దదే. మరోవైపు పిల్లల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే ఈ ట్రెండ్‌లో వారి బాల్యం.. గోప్యత ఎటో పోతున్నాయి. లైకుల కోసం పిల్లలను కెమెరా ముందు నిలబెట్టే తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలి.

రుద్రాన్ష్ కథలో అసలైన కిక్ ఏంటంటే.. సోషల్ మీడియాలో వ్యూస్ ఎప్పుడైనా మాయం కావొచ్చు.. కానీ ఈ బుడ్డోడికి దక్కిన ఈ లక్ మాత్రం ఏకంగా డిగ్రీ సర్టిఫికేట్ వరకూ పర్మినెంట్ అయిపోయింది.



Tags:    
  • rudranshsinghthakur 
  • viralvideo 
  • maharashtra 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS