భగవత్ కి 75 నిండాయి...మరో ఆరు రోజుల్లో మోడీకి 75
ఏమిటో 75 నంబర్ దేశ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా సంచలనమే అయింది. ఆ నంబర్ చూస్తే రాజకీయ నాయకులు ఎంతో కొంత కలవరపడిన సందర్భం ఉంది.;
ఏమిటో 75 నంబర్ దేశ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా సంచలనమే అయింది. ఆ నంబర్ చూస్తే రాజకీయ నాయకులు ఎంతో కొంత కలవరపడిన సందర్భం ఉంది. నిజానికి 13 సహా కొన్ని నంబర్లు అచ్చిరావని పాశ్చాత్య డేశాలలో భావన ఉంది. ఇండియాలో కూడా నంబర్ విషయంలో చాలా మందికి సెంటిమెంట్ ఉంది. అయితే వజ్రోత్సవాలకు అసలైన సంకేతంగా ఉన్న 75 నంబర్ ఎంతో శుభప్రదమైనదిగా అంతా భావిస్తారు. నూరేళ్ళ జీవితం అనుకుంటే అందులో ముప్పాతిక జీవితాన్ని చూసిన వారు సంపూర్ణ మానవులుగా కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు.
ఆ నంబర్ మీదే ఎందుకు:
ఇప్పటికి రెండు నెలల క్రితం అంటే జూలై నెలలో నాగపూర్ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ళ వయసు నిండిన వారు రాజకీయాల నుంచి హుందాగా తప్పుకుంటే బాగుంటుంది అన్నదే ఆయన ప్రకటన సారాంశం. ఆయన ఏ ఉద్దేశ్యంతో చేసినా తొందరలో 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోయే మోడీ గురించే అని ఆ మీదట రాజకీయ రచ్చ సాగింది. కాంగ్రెస్ అయితే ఆర్ఎస్ఎస్ మోడీని వద్దు అనుకుంటోంది, బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య అతి పెద్ద గ్యాప్ అని కూడా ప్రచారం చేసింది, విమర్శలు కూడా అలాగే వినిపించాయి. మోడీయే మా నాయకుడు ఆయనకు ఏజ్ తో సంబంధం లేదని బీజేపీ నేతలు చాలా మంది అన్నారు. ఇక నరేంద్ర మోడీ అయితే దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ ని బాగా పొగుడుతూ వచ్చారు. దీని మీద కూడా విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.
తూచ్ అనేసిన భగవత్ :
అయితే ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ శత వార్షిక ఉత్సవాలలో పాల్గొన్న మోహన్ భగవత్ అయితే తాను అలా బీజేపీని ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చారు. బీజేపీని నియంత్రించే బాధ్యత తమది కాదని తమకు ఆ ఉద్దేశ్యం కూడా లేదని అన్నారు. అలా మోడీ 75 ఏళ్ళ నిబంధనను ఆయన పక్కన పెట్టేశారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 11 అంటే గురువారం మోహన్ భగవత్ 75 ఏళ్ళ పుట్టిన రోజు వచ్చింది. ఆయన ఈ రోజుతో 76వ పడిలోకి అడుగుపెడుతున్నారు అన్న మాట. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు. దేశానికి అంకితం అయిన అరుదైన నాయకుడు అని కీర్తించారు. నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
యాభై ఏళ్ళ ఆర్ఎస్ఎస్ జీవితం :
ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ గా 2009 నుంచి అంటే 16 ఏళ్ళుగా కొనసాగుతున్న మోహన్ భగవత్ పూర్తి పేరు మోహన్ మధుకర్ భగవత్. ఆయన 1975 నుంచి ఫుల్ టైం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా మారిపోయారు. ఈ రోజుకు యాభై ఏళ్ళుగా సంఘ్ సేవలో ఉన్నారు. ఇక ఆయన విషయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఒక్కప్పటి బొంబై రాష్ట్రంలోని చంద్రపూర్ లో కార్హడే బ్రాహ్మణ మరాఠీ కుటుంబంలో భగవత్ 1975 సెప్టెంబర్ 11న జన్మించారు. ఆయన తండ్రి మధుకర్ రావు భగవత్, తల్లి మాలతి ఇద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ లో పూర్తి కాలం పనిచేసిన వారే కావడంతో భగవత్ లోనూ చిన్నతనం నుంచే సంఘ్ మీద అభిమానం ఏర్పడింది.
చదువు ఆపేసి మరీ :
భగవత్ కి సంఘ్ అంటే విపరీతమైన ఇష్టం అందుకే తరువాత వెటర్నరీ సైన్సెస్‌లో తన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుని సైతం మధ్యలో ఆపేసి 1975లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధం అయ్యారు. ఆ తరువాత 1991 నుండి 1999 వరకు భారతదేశానికి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ గా పనిచేశారు. తర్వాత అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ గా పనిచేశారు. 2000 సంవత్సరంలో నాలుగో సర్ సంఘ చాలక్ రాజేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుండి, హెచ్ వి శేషాద్రి ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు, సుదర్శన్ కొత్త చీఫ్ గా, భగవత్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009 మార్చి 21 న భగవత్ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ గా ఎన్నుకోబడ్డారు.
జెడ్ ప్లస్ వీవీఐపీ భద్రత :
ఇదిలా ఉంటే మోహన్ భగవత్ కి దేశంలోని వివిధ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుండి ముప్పు ఉందని భావించిన మోడీ ప్రభుత్వం 2015 జూన్ లో రౌండ్ ది క్లాక్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని ఆదేశించింది. అలా జెడ్ ప్లస్ వీవీఐపీ భద్రతా వలయంలో ఉన్న అతి తక్కువ మంది ప్రముఖుల్లో భగవత్ ఒకరుగా ఉన్నారు. అంతే కాదు 2017 లో, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత రాష్ట్రపతి భవన్‌కు అధికారికంగా ఆహ్వానించబడిన మొదటి ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా కూడా భగవత్ చరిత్రలో నిలిచారు. 2017 లో, ప్రభుత్వ-జంతు, మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయం నాగ్‌పూర్‌లో నిర్వహించిన స్తాతకోత్సవంలో మోహన్ భగవత్ గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేశారు.
మోడీ కూడా 75 నే :
ఇక ఆర్ఎస్ఎస్ స్ చీఫ్ మోహన్ భగవత్ కంటే నరేంద్ర మోడీ కేవలం ఆరు రోజులు మాత్రమే చిన్న వారు. ఆయన 1950 సెప్టెంబర్ 17 న జన్మించారు. తొందరలో మోడీ కూడా 76వ పడిలోకి వస్తారు. అయితే ఆయన ప్రజలు ఎంతకాలం అభిమానిస్తే అంతకాలం ప్రధానిగా ఉండొచ్చు అని భగవత్ ఈ మధ్యనే చెప్పేశారు కాబట్టి నో ఏజ్ కండిషన్. అంతే కాదు తనకు ఎనభయ్యేళ్ళు వచినా ఆర్ఎస్ఎస్ తననే నాయకత్వం వహించాలంటే తప్పకుండా చేయాల్సిందే అని కూడా భగవత్ చెప్పారు. సో ఈ ఇద్దరి 75 ఏజ్ అన్నది జస్ట్ నంబర్ మాత్రమే. వారే మరింత కాలం ఉన్నత స్థానాలలో కొనసాగుతారు. వారి అభిమానులూ అదే కోరుకుంటున్నారు.