ఇరాన్ లో ఇంటి పోరు మొదలు... ఖమేనీ 'భయపడిన ఎలుక'

అవును... ఇరాన్ చివరి షా కుమారుడు, బహిష్కరించబడిన ఇరానియన్ రాజకుటుంబ సభ్యుడు రెజా పహ్లవి ఆసక్తికర చర్యకు పిలుపునిచ్చారు.;

Update: 2025-06-18 21:30 GMT

ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్ ఖమేనీకి ఇరాన్ లో ఇంటిపోరు మొదలైంది.

అవును... ఇరాన్ చివరి షా కుమారుడు, బహిష్కరించబడిన ఇరానియన్ రాజకుటుంబ సభ్యుడు రెజా పహ్లవి ఆసక్తికర చర్యకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... ఇరాన్ సైన్యం, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త తిరుగుబాటులో చేరాలని కోరారు. దాని పతనం ప్రారంభమైందని తెలిపారు.

ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందించిన పహ్లవి... ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపుకు చేరుకుందని.. కూలిపోయే దశలో ఉందని.. భయపడిన ఎలుకగా ఖమేనీ భూగర్భంలో దాక్కున్నాడని.. పరిస్థితిపై నియంత్రణ కోల్పోయాడని అన్నారు. ఈ సందర్భంగా దేశంలోని అల్లకల్లోలంతో ప్రభావితమైనవారికి ఆయన తన సంఘీభావం తెలిపారు.

ఇదే సమయంలో.. ప్రస్తుత క్షణాన్ని చరిత్రలో ఒక పదునైన మలుపుగా అభివర్ణించిన పహ్లావి... ఈ పాలన పీడకలను శాశ్వతంగా అంతం చేయడానికి ఇప్పుడు కావాల్సిందల్లా దేశవ్యాప్త తిరుగుబాటని.. ప్రజలు వీధుల్లోకి రావాలని అన్నారు. ఈ సమయంలో.. ఇరాన్ భవిష్యత్తు, దాని అభివృద్ధి కోసం తమ వద్ద ఒక ప్రణాళిక ఉందని తెలిపారు.

కాగా... ఇరాన్‌ లో పాలన మార్పుకు మద్దతుగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక రోజు తర్వాత పహ్లవి నుంచి ఈ పులుపు రావడం గమనార్హం. ప్రస్తుత పాలన రోజులు దగ్గర పడ్డాయి.. ఇరాన్ మళ్లీ గొప్పగా మారగలదని తనకు తెలుసని నెతన్యాహు తెలిపారు.

ఇదే సమయంలో.. ఇరాన్ నియంతలు ఖచ్చితంగా ఇజ్రాయెల్ కు భయపడతారని.. అయితే.. వారు ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ప్రజలకు ఇంకా ఎక్కువ భయపడతారని.. ఇప్పుడున్న నియంతలను 80 శాతం ఇరానియన్లు తృణీకరిస్తున్నరని.. ఆ విషయం ఆ నియంతలకూ తెలుసని.. అది వారికి అర్ధమయ్యిందని నెతన్యాహు అన్నారు!

అలా నెతన్యాహు వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ఇరానియన్ రాజకుటుంబ సభ్యుడు రెజా పహ్లవి.. ఇరాన్ సైన్యం, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త తిరుగుబాటులో చేరాలని కోరడం గమనార్హం.

Tags:    

Similar News