కేసీఆర్ ఫోకస్ చేయని పాయింట్ ను టచ్ చేసిన రేవంత్

దేశ రాజధానిలో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ భవన్ మధ్య ఉన్న ఆస్తి పంపకాలతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజన మీద ఫోకస్ చేశారు.;

Update: 2023-12-20 12:30 GMT

తాను ఉండే అధికారిక నివాసం రాజ్ మహల్ ను తలపించేలా.. తాను వెళ్లే సచివాలయం తళతళలాడేలా ఉండాలని కోరుకునే కేసీఆర్ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు రేవంత్. తాను ఉండే నివాసం తాను ఇంతకాలం ఉన్న ఇంటినే వాడేస్తూ.. తాను వెళ్లాల్సిన ఆఫీసు కోసం అదనపు హంగులు అవసరం లేదని చెప్పటం.. చివరకు తాను ప్రయాణించే వాహనం సైతం తాను ఇప్పటివరకు వాడే వాహనాన్నే వాడేసేందుకు సిద్ధమైన రేవంత్.. తెలంగాణ రాష్ట్రానికి ఆస్తిగా ఉండే తెలంగాణ భవన్ లో శిధిలావస్థలో ఉన్న భవనాల రూపురేఖల్ని మాత్రం మార్చేయాలని డిసైడ్ కావటం గమనార్హం.

గత ముఖ్యమంత్రి తాను.. తాను నివాసం ఉండే భవనాల మీదనే తప్పించి.. తెలంగాణకు చెందిన పలువురు ఉండే నివాసాల మీదా.. ఆ భవనాల దుస్థితి మీదా.. దాని సౌకర్యాల మీద ఫోకస్ చేసింది. లేదు. తాజాగా ఢిల్లీకి వచ్చిన రేవంత్ .. తెలంగాణ భవన్ లో అధికారులతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ భవన్ మధ్య ఉన్న ఆస్తి పంపకాలతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజన మీద ఫోకస్ చేశారు. అంతేకాదు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. భవన్ ఓఎస్డీ సంజయ్ జాజూతో రివ్యూ చేశారు.

తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులోని భవనాలు.. వాటి పరిస్థితి.. తెలంగాణ వాటా కు సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ లోని భవనాలు శిధిలావస్థకు చేరుకున్న విషయాన్ని చెప్పిన అధికారుల మాటలతో స్పందించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర కల్చర్ ను ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ ను నిర్మిస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.24 ఎకరాల భూమి వస్తుందని చెప్పగా.. అందులోని భవనాలు పాతవై పోయాయని..వాటిని కట్టించి 40 ఏళ్లు అయినట్లుగా చెప్పగా.. కొత్త భవనాల్ని నిర్మిద్దామని పేర్కొన్నారు.

ఆస్తుల విభజన మీద పలు సూచనలు చేసిన రేవంత్.. విభజన లెక్కల్ని త్వరగా తేల్చేయమని చెప్పారు. ఇదంతా చూసిన వారు.. తన కోసం.. తన సౌకర్యాల మీద కంటే కూడా.. మిగిలిన వారి సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్న రేవంత్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గడిచిన పదేళ్లలో ఏ రోజు కూడా తెలంగాణ భవన్ లోని భవనాల పరిస్థితి ఏమిటి? అక్కడి వసతుల మాటేమిటి? అన్నదే అడగలేదని.. తాజా సీఎం మాత్రం తన తొలి అధికారిక పర్యటనలోనే ఆ ఇష్యూల మీద ఫోకస్ చేయటాన్ని ప్రస్తావిస్తున్నారు.

Tags:    

Similar News