కాంగ్రెస్ లో తిరుగులేని శక్తిగా రేవంత్?
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మళ్లీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపడతానన్న మాట చెప్పే అతి కొద్దిమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో రేవంత్ మొదటి వరుసలో ఉంటారని చెబుతారు. సీఎం పదవిని చేపట్టే అవకాశం నూటికి నూరు శాతం ఉన్నా.. తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని మాత్రమే చెప్పేవారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తిగా మారారా? ఎంతటి వారైనా సరే.. అధిష్ఠానం ముందు తల వంచక తప్పదని.. వారి అదుపులోనే ఉండాలే తప్పించి.. సొంతంగా కొన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం లేదన్న మాటకు భిన్నంగా రేవంత్ తీరు ఉండటం తెలిసిందే. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మళ్లీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపడతానన్న మాట చెప్పే అతి కొద్దిమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో రేవంత్ మొదటి వరుసలో ఉంటారని చెబుతారు. సీఎం పదవిని చేపట్టే అవకాశం నూటికి నూరు శాతం ఉన్నా.. తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని మాత్రమే చెప్పేవారు.
అందుకు భిన్నంగా రేవంత్ మాత్రం గడిచిన కొన్ని నెలలుగా తానే తదుపరి ముఖ్యమంత్రిగా తనను తాను చెప్పేసుకోవటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మూల సుత్రాలకు భిన్నంగా రేవంత్ తీరుపై పార్టీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగిన పరిస్థితి. ఇదంతా అహంకారంతోనో.. ఇతర కారణాలతో కాదని.. అంతా పక్కా వ్యూహంతోనే జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద విస్పష్టమైన ఆదేశాలతోనే రేవంత్ తీరు ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద ఆయన ఇచ్చిన కమిట్ మెంట్లలో ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాకపోవటం.. కొన్ని కీలక అంశాల్లో ఆయన చెప్పిన దానికి తగ్గట్లే పరిస్థితులు చోటు చేసుకోవటం.. మిగిలిన అంశాలకు సంబంధించి రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధినాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. తాను మరో టర్మ్ మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తానని..అనంతరంతాను కేంద్రరాజకీయాల్లోకి వెళ్లిపోతానని తనకు తానే స్పష్టత ఇచ్చేయటం కూడా ఒక కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.
నిజానికి తన వాదనను తొలుత కాంగ్రెస్ పెద్దలతో చెప్పి.. తన ఎన్నికల వ్యూహాన్ని వారికి వివరించి.. వారి సమ్మతితోనే తనకు తానుగా తరచూ తానే తదుపరి ముఖ్యమంత్రి అన్న మాట రేవంత్ నోటి నుంచి వస్తున్నట్లుగా చెప్పాలి. అనవసరమైన గందరగోళాన్ని నివారించటం.. అసంత్రప్తులకు చెక్ పెట్టటంతో పాటు.. కేసీఆర్ లాంటి వ్యూహకర్తకు చెక్ చెప్పేందుకు అవసరమైన బలం తనకు అవసరమన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పటం.. ఆ విషయంలో రేవంత్ వాదనకు వారు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే.. మిగిలిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా రేవంత్ కు ఫుల్ యాక్సిస్ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీకి చెందిన మరే నేతకు లేని విధంగా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని.. ఆయన వరకు ఆయన పార్టీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనలో నిజం ఎంత? అన్నది కాలం కచ్ఛితంగా చెబుతుందనటంలో సందేహం లేదు.