ఆయన సిగరెట్టు తాగడు...బీరు ముట్టడు
ఆయనలో చెడు లక్షణాలు కానీ చెడు అలవాట్లు కానీ తాను ఇంతవరకూ చూడలేదని ప్రశంసలతో ముంచెత్తారు.;
ఆయన ఉన్నది ప్రజలతో. నిత్యం ఒత్తిడిగా ఉండే రాజకీయ రంగంలో. ఎందరితో పరిచయాలు ఉన్నాయి. మరెందరితోనో కలసి భేటీలు వేయాలి. ఇలా రోజులో అత్యధిక గంటలు బిజీగా గడిపే పొలిటికల్ ఫీల్డ్ లో ఉండి కూడా ఏ మచ్చ లేని శ్రీరామచంద్రుడు మాదిరిగా ఉన్నారు ఆయన. ఇంతకీ ఆయన ఎవరు అంటే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆయన సిగరెట్టు ఇప్పటిదాకా తాగలేదుట. అలాగే బీరు అన్నది ముట్టలేదుట. విస్కీ ఆయన చేతిలో ఎవరూ చూడలేదుట. ఇక డ్రగ్స్ విషయం వస్తే ఆ ఊసే లేదుట. ఇలా అన్నీ సద్గుణ లక్షణాలు కలిగిన వారు మన ముఖ్యమంత్రి అని చెప్పినది సాటి కాంగ్రెస్ నాయకుడు కాదు, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
నిజంగా ఇది ఇంకా ఆశ్చర్యం. ఒక కాంగ్రెస్ సీఎం మీద బీజేపీ ఎంపీ ప్రశంసలు కురిపించడం అంటే గ్రేట్ అనుకోవాలి. హైదరాబాద్ లో జరిగిన యాంటీ డ్రగ్స్ కాంపెయిన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బీజేపీ ఎంపీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిని ఐకాన్ గా పోల్చారు.
ఆయనలో చెడు లక్షణాలు కానీ చెడు అలవాట్లు కానీ తాను ఇంతవరకూ చూడలేదని ప్రశంసలతో ముంచెత్తారు. దాంతో పాటు రేవంత్ రెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ ఆడడం బగా ఇష్టమని చెప్పారు. ఆయన మంచి ఆటగాడు అన్నారు అంటే క్రీడాకరుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అన్న మాట.
యువత రేవంత్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలి. రాజకీయాల పరంగా చూస్తే రేవంత్ రెడ్డి యంగ్ సీఎం కిందనే లెక్క. మరో పాతికేళ్ళ పాటు రాజకీయాలు చేస్తాను అని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న రేవంత్ రెడ్డి యూత్ కి ఐకాన్ అనే చెప్పాలి.
చాలా మంది డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కానీ నిజంగా డ్రగ్స్ గురించి ఏమీ తెలియని ఆ అలవాటు లేని రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రచారం చేస్తేనే దానికి ఎక్కువ విలువ అని అంటున్నారు. మనం పాటించి ఎదుటి వారికి చెప్పాలి అంటారు. అలా చూస్తే కనుక రేవంత్ రెడ్డి తాను రాముడు మంచి బాలుడిగా ఉంటూ యువతకు ఇస్తున్న సందేశం కచ్చితంగా అందరికీ ఎక్కుతుంది అని అంటున్నారు.
ఇక ఏపీ విషయానికి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఏ చెడు అలవాటు లేనివారుగా ఉన్నారు. ఆయన సైతం రాజకీయాల పట్ల ఆలోచనలతోనే ఉంటారు తప్ప ఎలాంటి వ్యసనాలకూ దూరమే అంటారు. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సిగరెట్ మద్యానికి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడమే కాకుండా యువతకు వాటి నుంచి దూరంగా ఉండాలని సందేశం ఇవ్వడం గొప్ప విషయం. మరి యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి.