• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అటెన్షన్‌ సీకింగ్‌...

అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌: కేటీఆర్ ఇబ్బంది పడుతున్న జబ్బు ఇదేనట!

| డైలీ బేసిస్ లో తనపై విమర్శల వర్షం కురిపించే మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

By - Tupaki Desk
Update: 2025-01-29 04:38 GMT

డైలీ బేసిస్ లో తనపై విమర్శల వర్షం కురిపించే మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అతనో మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. పెళ్లికి పోతే పెళ్లి కుమారుడిలా.. చావుకు పోతే శవంలా అందరి దృష్టీ తనపైనే ఉండాలనే ఒక రకమైన జబ్బుతో కేటీఆర్‌ బాధపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పేరును నేరుగా ప్రస్తావించని సీఎం రేవంత్.. ‘‘అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్న నాయకుడిని మంచి డాక్టర్‌కు చూపించండి. డబ్బులు తక్కువ పడితే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇప్పిస్తా’’ అంటూ మండిపడ్డారు.

ఈ కార్ రేసింగ్ ను రద్దు చేసి పెట్టుబడుల అవకాశాల్ని దెబ్బ తీశారంటూ తనపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన అంశం మీదా సీఎం స్పందించారు. తాము విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చామని.. విదేశాల్లో సొమ్ము దాచుకున్న నేత తరఫు ఫిర్యాదు చేసిన ప్రవీణ్ కుమార్ బానిస మనస్తత్వం నుంచి బయటకు రావాలని సూచన చేశారు.

భారీగా పెట్టుబడులు సాధించినందుకు రాష్ట్రంలో అంతా సంతోషపడుతుంటే.. ఒకే ఒక్కడు విపరీతంగా బాధ పడుతున్నారన్న సీఎం రేవంత్.. ‘‘అమెజాన్‌, సన్‌ పెట్రో కెమికల్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌... ఇలా అనేక ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటే కొందరు లేకితనంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఒప్పందాలపై అనుమానాలు ఉండే ధ్రువీకరించుకోవాలి. పెట్టుబడులను స్వాగతించే విశాల హృదయం లేని వారు మౌనంగా ఉండాలి.ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామో జాబితాలు, ఫోటోలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయి. అవసరమనుకుంటే పాత్రికేయులు ఒక కమిటీగా వేసి క్రాస్ చెక్ చేసినా ఫర్లేదు’ అని పేర్కొనటం గమనార్హం.

కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రేవంత్ ఒక దశ లో ఆయనపై ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పిచ్చోడు.. తిక్కలోడుగా అభివర్ణించారు. ‘‘అసలు ఆయనకు శ్వేతపత్రం అంటే అర్థం తెలుసా?ఒప్పందాలు రహస్యంగా చేసుకుంటే, అప్రకటిత సమాచారం ఏమైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతారు. దావో్‌సలో మేం చేసుకున్న ఒప్పందాల వివరాలన్నీ ఇప్పటికే ప్రకటించాం. వాటిపై ఏమైనా అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని, మీడియాను కూడా తీసుకొని వెళ్లి ఆయా కంపెనీలతో మాట్లాడాలి. ఏదో పదం బాగుంది కదా అని పదే పదే శ్వేతపత్రం అంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా చూస్తే.. అదే పనిగా తనను లక్ష్యం చేస్తూ విమర్శలు చేస్తున్న కేటీఆర్ కు హోల్ సేల్ గా సీఎం రేవంత్ ఒకేసారి ఇచ్చి పడేశారని చెప్పాలి.

Tags:    
  • Revanthreddy 
  • Telanganachiefminister 
  • Ktr 
  • Brs 
  • Kcr 
  • Harishrao 
  • Development 
  • Bjp 
  • Rspraveenkumar 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

Copyright @2026

Powered by Blink CMS