బనకచర్ల ఊసే లేదు....రేవంత్ రెడ్డి!

అజెండాలో ఆ అంశమే లేదని ఆయన అన్నారు. దాంతో బనకచర్ల విషయం గురించి చర్చ ఆపాల్సిన అవసరం అయితే లేనే లేదు కదా అని మీడియాతో అన్నారు.;

Update: 2025-07-16 15:15 GMT

ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఏపీ తెలంగాణా రాష్ట్రాల ముఖమంత్రుల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు ఊసే రాలేదని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అజెండాలో ఆ అంశమే లేదని ఆయన అన్నారు. దాంతో బనకచర్ల విషయం గురించి చర్చ ఆపాల్సిన అవసరం అయితే లేనే లేదు కదా అని మీడియాతో అన్నారు.

ఇక ఈ సమావేశంలో తాము పెట్టిన చాలా డిమాండ్లు నెగ్గించుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక విధంగా ఇది తెలంగాణా విజయం అని చెప్పాలని ఆయన అన్నారు. గోదావరి క్రిష్ణా జలాల జలాలకు సంబంధించి ఉన్న అన్ని సమస్యల మీద చర్చించడానికి రెండు రాష్ట్రాల అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఏపీతో తాము గొడవలు పెట్టుకోమని అదే సమయంలో తమ హక్కుల విషయంలో తెలంగాణా అసలు ఎక్కడా రాజీపడదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు జల జగడాలు కొందరికి కావాలని ఆయన విమర్శించారు. కానీ తాము మాత్రం ఏ వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని పరిష్కరించుకోవాలని చూస్తున్నామని అదే తమ అజెండా అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రిజర్వాయర్ కెనాల్స్ వద్ద యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీలు ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పారు. కృష్ణా నదీ జలాల వాడకం లెక్కలపైన అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అందుకే టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఒక వేళ ఈ విషయంలో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రాలే నిధులు సమకూర్చుకుని టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తాయని చెప్పారు. ఇక వీటి ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది అని ఆయన అన్నారు. కాగా ఈ భేటీలో తెలంగాణా ప్రభుత్వం లేవనెత్తిన టెలిమెట్రీలకు ఏపీ అంగీకరించడం మంచి పరిణామంగా తెలంగాణా చూస్తోంది

అందుకే తమ విజయం అని చెబుతోంది. అంతే కాదు బనకచర్ల ప్రాజెక్ట్ విషయం చర్చకు రాలేదని అంటోంది. ఇంకో వైపు చూస్తే రెండు నదీ జలాల నీటి విషయం మీద కచ్చితమైన వివరాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ నివేదిక తరువాత మరోసారి మీటింగ్ పెట్టి అడుగులు ముందుకు వేస్తారని అంటున్నారు. చూదాలి మరి రెండు రాష్ట్రాలు ఎలా ఆలోచిస్తాయో.

Tags:    

Similar News