• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పహల్గాం ఉగ్రదాడి.. రూ.4...

పహల్గాం ఉగ్రదాడి.. రూ.4 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ లాయర్ కథ

| డిజిటల్ అరెస్ట్ పేరుతో ఢిల్లీకి చెందిన 62 ఏళ్ల రిటైర్డ్ లాయర్ అతుల్ తల్వార్‌ను సైబర్ నేరగాళ్లు రూ.4 కోట్లు మోసం చేశారు. పహల్గాం ఉగ్రదాడి కేసుతో ఆధార్ కార్డును ముడిపెట్టి, సీబీఐ, ముంబై పోలీసుల అధికారులమంటూ నకిలీ పత్రాలు, వీడియోలతో 20 రోజుల పాటు భయపెట్టారు. అమెరికా రిటైర్మెంట్ ఖాతాల నుంచి రూ.1.5 కోట్లు, క్రిప్టో రూపంలో మరో రూ.2.5 కోట్లు వసూలు చేశారు. మోసం బయటపడటంతో బాధితుడు సైబర్ పోలీసులకు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే 1930కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-18 02:46 GMT

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ సైబర్ కేటుగాళ్లు మాత్రం చట్టాన్ని.. పోలీసులను.. సీబీఐని ఏకంగా తమ వాట్సాప్ గ్రూప్‌లోకి మార్చేసి మరీ పనులు కానిచ్చేస్తున్నారు. అమెరికాలో మూడు దశాబ్దాల పాటు కార్మిక సంఘాల తరఫున వాదించి.. చట్టం నూలుపోగులూ తెలిసిన ఓ రిటైర్డ్ లాయర్‌ను డిజిటల్ అరెస్ట్ భయంతో కేటుగాళ్లు నిలువునా ముంచేశారు. పహల్గాం ఉగ్రదాడితో లింకుపెట్టి.. ఆధార్ కార్డు అడ్డంపెట్టి ఏకంగా రూ. 4 కోట్లు కాజేసిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా నవ్వులపాలు కావడమే కాదు.. గుండెలు గుబేల్ మనేలా చేస్తోంది.

ఢిల్లీకి చెందిన 62 ఏళ్ల అతుల్ తల్వార్ 1982లో న్యూయార్క్‌కు వెళ్లి అక్కడ లాయర్‌గా సెటిలయ్యారు. జీవితమంతా చట్టంతోనే ఆటలాడిన ఆయనకు.. సైబర్ కేటుగాళ్లు ఆడే వెరైటీ గేమ్‌ ముందు దిమ్మతిరిగిపోయింది. ఈ ఏడాది జూలైలో ఇండియాకి వచ్చి నోయిడాలో ఇల్లు బాగుచేయిస్తున్న ఈయనగారికి అక్టోబర్ 17న ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ముంబై కొలాబా పోలీస్ స్టేషన్ అధికారినంటూ ఓ మహానుభావుడు ఊడ్చేశాడు. “మీ ఆధార్ కార్డు పహల్గాం ఉగ్రదాడి కేసులో దొరికింది బాబూ.. కెనరా బ్యాంకులో మీ అకౌంటుకు రూ. 53 కోట్లు వచ్చాయి.. అందులో నీ కమీషన్ రూ. 5 కోట్లు” అంటూ భయపెట్టాడు. లాయరైన తల్వార్ గారు ముందు ఖండించినా.. సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ వాట్సాప్‌లో పంపిన నకిలీ లెటర్ చూసి వణికిపోయారు.

ఇక అక్కడి నుంచి మొదలైంది అసలైన సినిమా. 20 రోజుల పాటు ఆయన్ని డిజిటల్ నిఘాలో పెట్టారు. ఎవరికీ ఫోన్ చేయకూడదు.. బయటికి వెళ్లకూడదు అంటూ ఆంక్షలు. మధ్యలో ఉగ్రవాదులను పట్టుకుంటున్నట్లు నకిలీ వీడియోలు చూపించి మరింత భయపెట్టేశారు. సీబీఐ, ఎన్ఐఏ అధికారులమంటూ ఆన్‌లైన్ విచారణ పేరుతో అమెరికా రిటైర్మెంట్ ఖాతాల్లోని డాలర్లను క్యాష్ చేయించి ట్యాక్స్‌ల పేరుతో రూ. 1.5 కోట్లు.. క్రిప్టోకరెన్సీ రూపంలో మరో రూ. 2.5 కోట్లు మొత్తం రూ. 4 కోట్లను గుంజేసి పీకేశారు. నవంబర్ 7న డబ్బులు తిరిగిరాకపోయేసరికి అనుమానం వచ్చి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. చివరకు అమెరికా వెళ్లాక ఎఫ్‌బీఐకి కూడా ఫిర్యాదు చేశారు.

ఎన్ని చదువులు చదివినా.. ఎంత పెద్ద లాయర్ అయినా.. సైబర్ కేటుగాళ్ల బెదిరింపులకు భయపడితే ఇలాగే జేబులు ఖాళీ అవుతాయి. పోలీసులైనా.. సీబీఐ అధికారులైనా ఎప్పుడూ వాట్సాప్ వీడియో కాల్స్‌లో డిజిటల్ అరెస్టులు చేయరు. అలా ఎవరైనా బెదిరిస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ఒక్కటే మార్గం.. గుర్తుంచుకోండి నాయనలారా.. లేకపోతే ఇలానే మీరు సంపాదించింది అంతా కేటుగాళ్లు ఉడ్చేస్తారు..

Tags:    
  • digitalarrest 
  • cyberfraud 
  • cybercrime 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS