పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు..ఈ కొమ్మ లెక్కే వేరు.. సూపరు!

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ అన్న సంగతి తెలిసిందే. నిజంగా... పల్లెలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.;

Update: 2025-12-02 08:37 GMT

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మాగాంధీ అన్న సంగతి తెలిసిందే. నిజంగా... పల్లెలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందులో భాగంగా... అక్షరాస్యత, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధిని సాదిస్తాయి. ఈ సమయంలో తాజాగా ఓ గ్రామం ఈ విషయంలో ఫుల్ మార్కులు సంపాధించింది.. ఆదర్శంగా నిలిచింది.

అవును... పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గాంధీ చెప్పగా.. ఇప్పుడు చెప్పుకోబోయే పల్లె లెక్కే వేరు.. దీని కథ సూపరు. ఈ గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే, ప్రతీ ఇంట్లోనూ ఒక ఉద్యోగి ఉన్నారు! ఆ గ్రామం పేరే.. ఏపీలోని పల్నాడు జిల్లాలోని రెడ్డిపాలెం. ఈ గ్రామంలో ఉన్నవారంతా ఎస్సీ, ఎస్టీలే. ఇది నల్లమల అంచున ఉన్న చిన్న పల్లె. ఇక్క 1912లోనే చర్చితో పాటు పాఠశాలను నెలకొల్పారు.

గ్రామంలో ఐకమత్యానికి, విద్యాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడింది! ఫలితంగా... ప్రభుత్వంలోని పలు శాఖల్లో 65 మంది ఉద్యోగులు ఈ గ్రామం నుంచే ఉన్నారు. వీరిలో సివిల్ జడ్జి కోర్టు న్యాయధికారి, తహసీల్దార్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు, పోస్టల్ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖలో అనేకమంది ఉన్నారు. ఓ 40 మంది ఊరికి సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

ఈ ఊరిలోని ప్రజలంతా ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నా... ప్రతీ ఏటా డిసెంబర్ 3న నిర్వహించే పునీత ఫ్రాన్సిస్ శౌరి చర్చి పండగకు మాత్రం తప్పనిసరిగా గ్రామానికి చేరుకుంటారు. వేర్వేరు ప్రాంతల్లో సబ్ రిజిస్టార్లుగా పని చేస్తున్న ముగ్గురి సారథ్యంలో ఈ గ్రామంలో ఉద్యోగుల సంఘం ఏర్పాటైంది. ఈ క్రమంలో గ్రామంలో మొక్కలు నాటారు.

ఇదే క్రమంలో... పల్లెలోని ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఉంది. మరుగుదొడ్లు ఉన్నాయి. అదేవిధంగా... ఊరంతా సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఏటా అంతా ఊరికి చేరుకున్నప్పుడు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తుంటారు! మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రామంలో 1981 నుంచి ఇప్పటివరకూ 8 సార్లు సర్పంచ్ ఎన్నికలు జరగ్గా, ఏడుసార్లు ఏకగ్రీవం అయ్యాయి.

ఉమ్మడి జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి 86 కి.మీ.. మాచర్ల నుంచి 42 కి.మీ.. మండల కేంద్రం ఉంచి 17 కి.మీ.. హైదరాబాద్ నుంచి 206 కి.మీ దూరంలో ఉన్న ఈ రెడ్డిపాలెం గ్రామానికి సమీప నగరాలుగా వినుకొండ, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి ఉన్నాయి.

Tags:    

Similar News