• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాగబాబు వర్సెస్...

నాగబాబు వర్సెస్ ఆర్జీవీ... మధ్యలో "కమెడియన్"!

| గతకొంతకాలంగా ఆర్జీవీ వర్సెస్ ఏపీ విపక్షాలు టాపిక్ ప్రధానంగా నెట్టింట వైరల్ ఇష్యూ అనేది తెలిసిన సంగతే

By - Tupaki Desk
Update: 2023-12-28 05:02 GMT

గతకొంతకాలంగా ఆర్జీవీ వర్సెస్ ఏపీ విపక్షాలు టాపిక్ ప్రధానంగా నెట్టింట వైరల్ ఇష్యూ అనేది తెలిసిన సంగతే. ఈ క్రమంలో తాజాగా "వ్యూహం" సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వార్ మరింత రసవత్తరంగా మారింది. మధ్య మధ్యలో తలనరికి తెస్తే కోటి నజరానా అనే స్థాయిలో శృతిమించిన, ఏమాత్రం సమర్ధనీయం కాని కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయితే వీటికి రావాల్సిన వారి నుంచి సరైన ఖండన రాకపోవడం గమనార్హం.

దీంతో ఈ విషయాలపై నాగబాబు ఫేస్ బుక్ లో స్పందించారు. ఇందులో భాగంగా... "ఆర్జీవీ తల నరికితే కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లడిన వ్యక్తి" అనేది యాక్షన్ అయితే... అందుకు "ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైన తనపై దాడి చేసే అవకాశం ఉందని తనకి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆర్జీవీ" అనేది రియాక్షన్ అని స్పందించిన నాగబాబు.. అనంతరం తన కన్ క్లూజన్ ఇచ్చారు!

ఇందులో భాగంగా... "ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని మొదలుపెట్టిన నాగబాబు... "ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి.. మీ జీవితానికి ఏ డోఖా లేదు.. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను" అని అన్నారు. అనంతరం ఆ హామీ ఇవ్వడానికి గల కారణాలను వెల్లడించారు.

అందులో భాగంగా... "ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ లో, ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు.. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి - ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి, నాగబాబు" అని క్లారిటీ ఇచ్చారు!

దీంతో ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా... "సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు.. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి" అని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఈ ట్వీట్ కి వచ్చే కామెంట్లలో నాగబాబుకు కౌంటర్ గా ఉన్నవాటిని కూడా తిరిగి షేర్ చేసిన ఆర్జీవీ... నాగబాబు శ్రేయోభిలాషిగా ఆ ట్వీట్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆర్జీవీ వెటకారం ఇలా ఉంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

ప్రస్తుతం ఈ పోస్టులు, దానికి ఆర్జీవీ ట్వీట్లు... వాటికింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లతో సోషల్ మీడియా వేడెక్కిపోతుంది! కాగా... వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది!

సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు 🤣🤣🤣 మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి 😎😎😎 pic.twitter.com/RbhusBDNvf

— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023
Tags:    
  • Ramgopalvarma 
  • Nagababu 
  • Appolitics 
  • Pawankalyan 
  • Socialmedia 
  • RGV 
  • Trolling 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS