• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ మాజీ ఎంపీకి...

వైసీపీ మాజీ ఎంపీకి బిగుస్తున్న ఉచ్చు.. ఏం జ‌రిగింది ..!

| వైసీపీ మాజీ ఎంపీ.. త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చి కూట‌మి స‌ర్కారుపై సెటైర్లు పేల్చే భ‌ర‌త్ రామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By - Garuda Media
Update: 2025-11-14 16:30 GMT

వైసీపీ మాజీ ఎంపీ.. త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చి కూట‌మి స‌ర్కారుపై సెటైర్లు పేల్చే భ‌ర‌త్ రామ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి ని యోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌.. 2024 ఎన్నిక‌ల్లో మాత్రం ప‌రాజ‌యం పాల‌య్యా రు. ఆ త‌ర్వాత నుంచి కూట‌మిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా భ‌ర‌త్ అనుచ‌రుడు ఒక‌రు మీడియా ముందుకు వ‌చ్చారు.

గ‌తంలో భ‌ర‌త్ చేసిన చీక‌టి దందాకు తానే సాక్ష్యం అని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీని పై కూట‌మి నేత‌లు నిశితంగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా.. భరత్ ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ వ‌ద్ద ప‌నిచేసిన రామశర్మ అనే వ్య‌క్తి మీడియా ముందుకు వ‌చ్చారు.

అప్ప‌టి ఎంపీ భరత్ చీకటి దందాలకు తానే సాక్ష్యమ‌ని.. అన్నీ త‌న‌కు తెలుసున‌ని శ‌ర్మ వ్యాఖ్యానించాడు . అంతేకాదు.. అందుకే తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీల‌క విష‌యాలు కూడా చెప్పుకొచ్చారు. భరత్‌ కోసం నేను చాలా చేశాను. టీడీపీ నాయకుడు యిన్నమూరి దీపును బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం. ఏపీ పేపర్‌ మిల్లు యూనియన్ నేత చిట్టూరి ప్రవీణ్‌ చౌదరిని వైసీపీలోకి లాగేశాం. రెడ్‌ గ్రావెల్‌ మైనింగ్‌, ఇసుక ర్యాంప్‌, బుర్రిలంక ఇసుక ర్యాంప్‌నకు సంబంధించి నెలవారీ మామూళ్లు 5 కోట్ల వరకు వ‌సూలు చేశామ‌ని కూడా వెల్ల‌డించాడు.

అంతేకాదు.. పార్టీ కోసం కూడా తాను ఎంతో ఖ‌ర్చు చేసిన‌ట్టు శర్మ చెప్పుకొచ్చాడు. ఈ ప‌రిణామాల‌తో.. భ‌రత్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర‌త్‌పై పెద్దగా ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన అనుచ‌రుడే ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం.. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా త‌న‌వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్ప‌డం తో స‌హ‌జంగానే భ‌ర‌త్ ఇప్పుడు టార్గెట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.


Full View


Tags:    
  • ysrcp 
  • marganibharat 
  • andhrapradeshpolitics 
  • rajahmundry 
  • politicalscandal 
  • tdp 
  • miningmafia 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS