కార్యకర్త మాట...రాహుల్ ఆయన్ని సీఎం చేస్తారా ?
ఇక మీనా అన్న కార్యకర్త రాహుల్ కి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ గురించి చెబుతూ ఆయన మంచివారే కానీ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకుని రావాలంటే మాత్రం సచిన్ పైలెట్ ఉండాల్సిందే అని చెప్పేశారు.;
ఏ పార్టీకైనా గ్రాఫ్ పెరగాలి అన్నా తాము తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకోవాలి అన్నా గ్రౌండ్ లెవెల్ లో కి వెళితేనే అసలు విషయాలు తెలుస్తాయి. అలా చూస్తే కనుక చాలా మంది ఫీడ్ బ్యాక్ అని తెప్పించుకుంటారు. సర్వేలు చేయిస్తారు. కానీ రియల్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి తమ సొంత పార్టీ వారిని కాస్తా కదిలించినా చాలు నిజాలు అలా గటగటా బయటకు వచ్చేస్తాయి.
ఇక కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమ పార్టీ పరిస్థి ఒక నిఖార్సు అయిన కార్యకర్త నుంచి ఫీడ్ బ్యాక్ రాబట్టే ప్రయత్నం చేశారు. ఆయన తాజాగా రాజస్థాన్ పర్యటన చేపట్టారు. ఆయన అక్కడ పర్యటిస్తూ కారు ఆపి మరీ కాంగ్రెస్ కార్యకర్తను పలకరించారు.
ఆయన నవాయ్ మాథోపూర్ లోని రణ తంబోరు జాతీయ ఉద్యానవనానికి వెళ్తూ కార్యకర్తను పలకరించారు అన్న మాట. అయితే ఆ కార్యకర్త రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పేశారు. ఆయనను రాష్ట్రంలో ఎవరి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించడమే తరువాయి మాకు సచిన్ పైలెట్ కావాలని గట్టిగానే చెప్పేశారు.
రాష్ట్రంలో పార్టీ పగ్గాలు సచిన్ పైలెట్ కి ఇస్తేనే పార్టీ బాగుపడుతుంది అని చుట్టన్ లాల్ మీనా అనే ఆ కార్యకర్త చెప్పిన జవాబుకు రాహుల్ సైతం కాస్తా విస్మయం వ్యక్తం చేసినా అనంతరం చిరునవ్వులే చిందించారు. అధినాయకుడి ఎదుటా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టడం అంటే మీనా ధైర్యానికి హేట్సాఫ్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల పాటు వ్యక్తిగత పర్యటన కోసం రాజస్థాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రణతంబోరు లో పర్యటించారు. ఇక మీనా అన్న కార్యకర్త రాహుల్ కి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ గురించి చెబుతూ ఆయన మంచివారే కానీ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకుని రావాలంటే మాత్రం సచిన్ పైలెట్ ఉండాల్సిందే అని చెప్పేశారు.
ఇక చూస్తే కనుక 2018 నుంచి 2023 మధ్యలో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేది. అశోక్ గెహ్లాట్ సీనియర్ నేత అని ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పెద్దలు అప్పగించారు. ఆ ఎన్నికల్లో కూడా సచిన్ పైలెట్ తన గ్లామర్ తోనే గెలిపించుకుని వచ్చారు.
అంతా ఆయన సీఎం అవుతారు ఐ అనుకున్నారు. కానీ యువ నేతను పక్కన పెట్టి సీనియర్ అయిన గెహ్లాట్ కి పట్టం కట్టారు. ఇక 2018 నుంచి 2020 దాకా రెండేళ్ళ పాటు సచిన్ పైలెట్ ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్యల ఆధిపత్య పోరు సాగడంతో 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం పోగొట్టుకుంది. ఇక 2028లో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే సచిన్ పైలెట్ కి పార్టీలో కీలక పాత్ర ఇవ్వాలని అంతా కోరుతున్నారు. అదే సగటు కాంగ్రెస్ కార్యకర్త నోటి వెంట కూడా వచ్చింది అని అంటున్నరు.
మరి కాంగ్రెస్ అగ్ర నేతగా ఉన్న రాహుల్ గాంధీయే గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది, ఎవరేమి అనుకుంటున్నారు అన్నది ఆరా తీసారు కాబట్టి రాజస్థాన్ రాజకీయాల్లో సచిన్ పైలెట్ కి మంచి రోజులు వస్తాయా అంటే రాహుల్ తీసుకునే నిర్ణయం మీదనే అది ఆధారపడి ఉంది.