తన గురించి ఎక్కువ మాట్లాడితే... జగన్ కు రఘురామ మాస్ వార్నింగ్!

సార్వత్రిక ఎన్నికల వేళ ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు మరింత డోసు పెంచుతున్నారు

Update: 2024-04-29 11:13 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు మరింత డోసు పెంచుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సుమారు గత నాలుగేళ్లకు పైగా అవిరామంగా విమర్శలు చేస్తున్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు.. ఎన్నికల వేళ మరింత ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో... తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ... వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

అవును... గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పొటీ చేసీ గెలిచిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఈసారి మాత్రం ఆయన కోరుకున్నట్లుగా ఆ టిక్కెట్ దక్కకపోవడంతో, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగితున్నారు. అక్కడ వైసీపీ తరుపున పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో... టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు బరిలోకి దిగారు.

ఇందులో భాగంగా... టీడీపీ నుంచి ఉండిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వేటుకూరి వెంకట శివరామరాజు.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో... వైసీపీ వర్సెస్ కూటమి అనుకున్న చోట బలమైన త్రిముఖపోరు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో స్పందించిన రఘురామ... శివరామరాజుని వైసీపీ నేతలే నిలబెట్టారన్నట్లుగా విమర్శించారు.

ఈ క్రమంలోనే... "నీకు ఇదే చెప్తున్నా.. కన్నాలేసింది నువ్వు.. నీ పార్టీ నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా ఈ కొత్తగా పెట్టిన రాజద్రోహాలూ ఇవీ కాకుండా.. అప్పటికి కూడా కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు సీటు ఎలా ఇచ్చావు? ఎక్కువగా మాట్లడితే ఇంకా ఎక్కువ విషయాలు నీ గురించి చెప్పాల్సి వస్తుంది. యాక్సిడెంట్ అయినప్పుడు నీ తండ్రిగారు ఏమి మాట్లాడారో చెప్తున్నా అని.. అతి త్వరలో చిత్తుగా ఓడిపోతున్నావు.. రాజకీయ చిత్రపటం నుంచి జగన్ ను తొలగిస్తున్నాం" అని రఘురామ చెప్పుకొచ్చారు!

ఇలా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ.. వైఎస్ జగన్ పై ఈ స్థాయిలో ఘాటుగా స్పందించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది!

Tags:    

Similar News