సునీల్ థర్డ్ ఫ్రంట్ చర్చలు - రివీల్ చేసిన రఘురామ

లేటెస్ట్ గా ఒక తెలుగు టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఏపీలో కొత్త కూటమిని రాజకీయ సామాజిక కోణంలో ప్రతిపాదిస్తున్నట్లు గా ప్రకటించారు.;

Update: 2026-05-04 03:57 GMT

లేటెస్ట్ గా ఒక తెలుగు టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఏపీలో కొత్త కూటమిని రాజకీయ సామాజిక కోణంలో ప్రతిపాదిస్తున్నట్లు గా ప్రకటించారు. ఆ కూటమిలో ఏపీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాలు ఉంటాయని అవన్నీ కలిసి పనిచేస్తే మొత్తం 50 శాతం పైగా ఓటు షేర్ కలిగిన వారికి రాజ్యాధికారం దక్కుతుందని లెక్క చెప్పారు. అయితే దీని మీద యాంకర్ అయితే ఒక ప్రశ్న వేశారు. కాపులకు ఐకానిక్ గా ఉన్న పవన్ కళ్యాణ్ వంటి వారితో సంప్రదిస్తున్నారా అని. అయితే తాము ప్రతిపాదన చేశామని చర్చలు జరుగుతున్నాయని అవతల వైపు ఎవరు సంప్రదిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నట్లుగా చెప్పారు.

ఈ పార్టీలతోనేనా :

అయితే ఏపీలో చిత్తూరు జిల్లాకు చెందిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, పార్టీ పెట్టాలనుకుంటున్న వంగవీటి మోహన రంగా కుమార్తె, మంద క్రిష్ణ మాదిగ, పీవీ సునీల్ అంతా కలిసి తొందరలో చర్చించబోతున్నారు అని తనకు సమాచారం ఉందని రఘురామ క్రిష్ణం రాజు ఆకివీడులో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. వారి సమావేశం చర్చలు విజయవంతం కావాలని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. రిజర్వేషన్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎవరెవరు కావాలని వీరంతా కలిసి కూర్చుని చర్చిస్తారు అని తనకు తెలిసిందని ఆయన చెప్పారు.

వర్కౌట్ అయితే కనుక :

అయితే ఏపీ రాజకీయాల్లో చాలా కొత్త పార్టీలు రావాలని చూస్తున్నాయి. 2029 ఎన్నికల్లో పోటీకి అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. అలాగే జడ శ్రావణ్ తన రాజకీయ పార్టీతో సిద్ధంగా ఉన్నారు. మాజీ ఐఏఏస్ అధికారి విజయ్ కుమార్ వంటి వారు మీడియా ముందు డిబేట్స్ తో కనిపిస్తున్నారు. వీరంతా కలసి 2029 లో ఒక కూటమిగా ఏర్పడతారా లేదా రెండు కూటములుగా ఏర్పాటు అయి పోటీకి వస్తారా ఇక ఎవరి మటుకు వారు వస్తారా అన్నది ఒక చర్చ. అయితే ఈ పార్టీలన్నీ కలిస్తే ఏపీ రాజకీయాలో మార్పులు ఏ మేరకు వస్తాయన్నది చూడాలని అంటున్నారు. 2019 లో పవన్ కళ్యాణ్ వంటి చరిష్మా టిక్ లీడర్ జనసేనతో బీఎస్పీ వామపక్షాలను కలుపుకుని కూటమిగా పోటీ చేస్తే జనాల నుంచి పెద్దగా స్పందన రాలేదని గుర్తు చేస్తున్నారు.

బలంగా ఆ పార్టీలు :

ఏపీలో టీడీపీ కూటమి ఒక వైపు మరో వైపు వైసీపీ బలంగా ఉన్నాయి. వైసీపీకి 40 శాతం ఓట్ షేర్ ఉంది. అలాగే టీడీపీ కూటమికి 2024 లో 56 శాతానికి పైగా ఓటు షేర్ దక్కింది. మరి ఏపీలో ఈ పార్టీలకే కట్టుబడి ఉన్న బలమైన ఓటింగ్ ఉంది. దాంతో రాజకీయంగా శూన్యత అన్నది లేదని అంటున్నారు. అయితే కొత్త కూటములు పార్టీలతో వచ్చే వారికి అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. వారు కూడా అదే ఆశతో పోటీకి దిగుతారు మొత్తం మీద ఏపీలో థర్డ్ ఫోర్స్ అయినా మరే ఫోర్స్ అయినా బలమైన పార్టీల అండ లేకపోతే దూకుడు రాజకీయం చేయగలదా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News