టార్గెట్ భారత్... 'ప్రాజెక్ట్ సిలికాన్' తో షాకింగ్ విషయాలు!

తాజాగా అక్కడి పోలీసులు ప్రాజెక్ట్ సిలికాన్ పేరిట నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ లో 479 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఇదంతా భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం చేసే పనిగా తెలిపారు.;

Update: 2025-06-12 06:43 GMT
టార్గెట్ భారత్... ప్రాజెక్ట్ సిలికాన్ తో షాకింగ్ విషయాలు!

భారత్ టార్గెట్ గా ఖలిస్తానీ సానుభూతిపరులు నిధుల సమీకరణకు కెనడాలో భారీ ఎత్తున డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అక్కడి పోలీసులు ప్రాజెక్ట్ సిలికాన్ పేరిట నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ లో 479 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఇదంతా భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం చేసే పనిగా తెలిపారు.

అవును... భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసేలా కెనడాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 47.9 మిలియన్ డాలర్ల విలువ చేసే 479 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ప్రాజెక్టును కెనడాలోని పిల్ రీజనల్ పోలీసులు చేపట్టగా.. దీని పేరు ప్రాజెక్ట్ సిలికాన్!

ఈ సందర్భంగా స్పందించిన పీల్ పోలీసులు... ఈ దాడుల్లో భారతీయ మూలాలున్న ఏడుగురు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరికి మెక్సికన్ ముఠాలతో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు. వీరు అమెరికా - కెనడా మధ్య ఉన్న వాణిజ్య ట్రక్కుల రవాణా మార్గాన్ని వాడుకొంటున్నట్లు గుర్తించారు.

ఇదే సమయంలో... ఈ డ్రగ్స్ అక్రమ వ్యాపారం నుంచి వచ్చే సొమ్మును భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు వెల్లడించిన పీల్ పోలీసులు.. ఈక్రమంలో ఆందోళనలు, ఆయుధాల కొనుగోళ్లు వంటి వాటికి పాల్పడుతున్నారని.. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐ.ఎస్‌.ఐ మద్దతుతోనే ఈ ఖలిస్థానీ ముఠాలు ఈ విలువైన కొకైన్‌ ఎగుమతి చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

కాగా... గత ఏడాది డిసెంబర్ లోనూ అమెరికాలోని ఇల్లినాయిస్ లో భారతీయ మూలాలున్న ఇద్దరు కెనడా వాసులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి వద్ద నుంచి 1,000 పౌండ్ల కొకైన్ ను గుర్తించారు. దీనికి సంబంధించిన దర్యాప్తు 2024 జూన్ లోనే మొదలైంది. ఇందులో భాగంగా.. అమెరికా - కెనడా మధ్య వాణిజ్య ట్రక్కులు ప్రయాణించే మార్గాలపై నిఘా ఉంచారు.

Tags:    

Similar News