యుద్ధాన్ని మీరు మొదలెట్టారు, నేను ముగిస్తాను!

గత కొద్ది రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సోషల్ మీడియాలో మెయిన్ కంటెంట్ అయిపోయారు. ఆయన చుట్టూనే అంతా సాగుతోంది.

Update: 2026-05-24 07:47 GMT

గత కొద్ది రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సోషల్ మీడియాలో మెయిన్ కంటెంట్ అయిపోయారు. ఆయన చుట్టూనే అంతా సాగుతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాని పవన్ నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ ని అరెస్ట్ చేయమని కోరారని, దానికి అమిత్ షా జగన్ లాంగ్ టెర్మ్ ఫ్రెండ్ అని చెప్పారని ఒక యూ ట్యూబ్ చానల్ లో ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ అతి పెద్ద రచ్చకు దారి తీశాయి. ఇది ఏపీలో కూటమి రాజకీయాలను సైతం కుదిపేసింది. జగన్ అరెస్ట్ పవన్ కి ఎందుకు అంత అవసరం అన్నది ఒక చర్చ అయితే అసలు కేంద్రంలో బీజేపీకి వైసీపీకి మధ్య తెర వెనక బంధం నిజమా అన్నది మరో చర్చ. ఇవన్నీ పక్కన పెడితే అమిత్ షా పవన్ నాదెండ్ల ముగ్గురు మాత్రమే ఉన్న ఆ భేటీ వివరాలు ప్రొఫెసర్ కి ఎలా తెలిసాయని జనసేన లాజిక్ తో కూడిన ప్రశ్న వేసి ప్రొఫెసర్ ని ఇరికించింది.

సోషల్ మీడియాలో రచ్చ :

తనకు జనసేన కీలక నేతల నుంచి లీక్స్ అందాయని మొదట చెప్పిన ప్రొఫెసర్ తరువాత ఇంత రచ్చ జరగడంతో తనకు తప్పుడు సమాచారం అందిందని చెప్పి తన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటున్నాను అని బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ మీదట సారీ అని కూడా అనేశారు. అయినా సరే ఈ వివాదం ఎక్కడా ఆగడం లేదు, ప్రొఫెసర్ మీద జనసేన నేతలు కాకినాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే ప్రొఫెసర్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఆయనను వైసీపీ పేటీఎం అని ఇంకా అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దాంతో మరింత ఆగ్రహించిన ప్రొఫెసర్ ఒక యూ ట్యూబ్ చానల్ లో మాట్లాడుతూ ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

యుద్ధాన్ని నేను ముగిస్తా :

ఇది చాలా కీలకమైన ప్రకటనగానే చూడాలని అంటున్నారు. యుద్ధాన్ని మీరు మొదలెట్టారు, నేను ముగిస్తాను అని ప్రొఫెసర్ చేసిన తాజా వ్యాఖ్యలతో వ్యవహారం ఇంకా ముదిరి పాకాన పడేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ పట్టుదల ఆయన నిబద్ధత గురించి మరో వైపు చర్చ సాగుతోంది. ఆయన ఒక ఇష్యూ మీద మాట్లాడినపుడు ఎంతో స్టడీ చేసి కానీ మీడియా ముందుకు రారని అంటారు. ఆయన చెప్పే ప్రతీ విషయం మీద గణాంకాలతో కూడిన పక్కా మ్యాటర్ ఉంటుందని కూడా అంటారు. అలాంటిది ఆయన ఇంత పెద్ద విషయాన్ని యధాలాపంగా అన్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మరి ఆయనకు లీక్ చేసినది ఎవరు, ఆ పేరు చెప్పడం ఇష్టం లేకనే ఈ విధంగా సారీ చెప్పారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తాను ఇష్యూ క్లోజ్ అని చెప్పి సారీ చెప్పాక కూడా రాద్ధాంతం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ బిగ్ సౌండ్ చేస్తున్నారు.

నేను పేటీఎం అయితే :

తానే పేటీఎం అయితే జగన్ కంటే ముందు చంద్రబాబే తనకు కొనేవారు కదా అని ప్రొఫెసర్ ఒక లాజిక్ తో కూడిన ప్రశ్న వేశారు. ఇది పోటీ రాజకీయ ప్రపంచం. పైగా అన్ని విషయాల్లో జగన్ కంటే ముందే చంద్రబాబు ఉంటారు, కాబట్టి బాబు ఈ చాన్స్ వదిలేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఇక గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ లో జరిగిన ఒక కార్యక్రమానికి తనను జ్యూరీగా ఆహ్వానించారు అని తాను పేటీఎం అయితే ఆహ్వానించేవారేనా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినపుడు తెలంగాణాకు చెందిన తన ఒక్కరినే దానికి పిలిచారని మరి పేటీఎం అని అనుకుంటే ఎందుకు పిలుస్తారు అని మరో ప్రశ్న వేశారు.

సహనం నశించింది అంటూ :

తన సహనం నశించింది అని ప్రొఫెసర్ అన్నారు. తాను 2009లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని ఓడించి గెలిచి వచ్చాను అని చెప్పారు. అదే టీడీపీ మాత్రం బీజేపీ మద్దతు లేకుండా ఏ ఎన్నికలోనైనా గెలిచిందా అని ప్రొఫెసర్ నిలదీశారు. తన సహనానికి హద్దు ఉందని ఇపుడు సోషల్ మీడియాలో తన మీద చేస్తున్న విమర్శలు టార్గెట్ చేస్తున్న వైనం చూస్తే కనుక తాను ఇక మౌనంగా ఉండేది లేదని ప్రొఫెసర్ తేల్చి చెప్పారు. తాను యుద్ధాన్ని ముగిస్తాను అంటూ ప్రొఫెసర్ చేసిన ఈ ప్రకటనలతో ఆయన వద్ద మరింత విలువైన సమాచారం ఏదైనా ఉందా దానిని ఆయన బ్లాస్ట్ చేస్తారా అన్న కొత్త చర్చ మొదలైంది. మొత్తానికి ప్రొఫెసర్ ఎపుడూ చేసే రాజకీయ విశ్లేషణలో భాగంగా గతంలో పవన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసిన విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు. అది ఇంత రచ్చ చేస్తుందని ఆయన కూడా బహుశా ఊహించి ఉండరని అంటున్నారు. ఏది ఏమైనా ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్యే, మేధావి, రాజకీయ శాస్త్రాన్ని వ్యూహాలను క్షుణ్ణంగా అవగాహన పట్టిన వారు.ఆయన వద్ద చాలా మ్యాటర్ అయితే ఉందని అంటున్న వారూ ఉన్నారు. సో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News