• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జమిలి బిల్లు... తెలంగాణలో...

జమిలి బిల్లు... తెలంగాణలో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన!?

| ఈ సందర్భంగా బిల్లు సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే... లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పలనపై చర్చ తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-12-18 03:57 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా మంగళవారం నాడు '129వ రాజ్యాంగ సవరణ బిల్లు'ను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపే విషయంపై విపక్షాలు డివిజన్ ను కోరడంతో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

ఇలా సుమారు గంటన్నర చర్చ అనంతరం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓటింగ్ జరగా.. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోద ముద్రవేశారు. ఈ బిల్లును ‘ఇండియా’ కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా.. బీజెపీ & కో సంపూర్ణ మద్దతు తెలిపాయి.

ఈ సందర్భంగా విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి అని.. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ కు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడగా.. జమిలి ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది.

ఇదే సమయంలో... జమిలి ఎన్నికలు అంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూ.. ఇవి ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించింది. ఈ సందర్భంగా బిల్లు సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే... లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పలనపై చర్చ తెరపైకి వచ్చింది.

అవును... జమిలి బిల్లు చట్టరూపం సంతరించుకుంటే, ఆ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్ అనంతరం ఏర్పడే లోక్ సభ తొలి సిట్టింగ్ డే కు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్ని అపాయింట్ డే గా పిలుస్తారు. ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలూ లోక్ సభ కాలపరిమితితో పాటే ముగుస్తాయి.

ఇక అక్కడ నుంచి ప్రతీసారీ అటు లోక్ సభ, ఇటు శాసన సభలకు దేశం మొత్తం మీద ఏక కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2029 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. అనంతరం ఏర్పడే 19వ లోక్ సభ సిటింగ్ డేట్ ను రాష్ట్రపతి నిర్ధారిస్తారు. అది జూన్ 1 గా నిర్ధారిస్తే.. ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ కూడా ఆ లోక్ సభతో పాటే ముగుస్తాయి.

ఈ విధానం వల్ల లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోని ఎన్నికలకు ఎలాంటి సమస్యా ఉండదు! అయితే... తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛతీస్ గఢ్, రాజస్థాన్ లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలూ 2028 నవంబర్ – డిసెంబర్ లో జరిగి.. 2033 నవంబర్ వరకూ (ఐదేళ్లు) మనుగడలో ఉంటాయి.

అయితే... 2029లో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో వాటి కాలపరిమితి 2034 మేలోనె ముగియనుండటం వల్ల 2033 నవంబర్ – డిసెంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను 2034 లోక్ సభ ఎన్నికలతో పాటే నిర్వహిస్తారు. ఈ మధ్యలో 2033 డిసెంబర్ నుంచి 2034 మే మధ్య ఉండే ఆరు నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అంటున్నారు.

తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పరిస్థితి ఆరు నెలల రాష్ట్రపతి పాలనగా ఉంటే... 2028 మే, జూన్ నెలల్లో జరగాల్సిన కర్నాటక, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల అసెంబ్లీలు 2033 మె, జూన్ లోనే ముగుస్తాయి. అంటే.. జమిలీ విధానంలో ఎన్నికలు జరగాలంటే.. వీటికి ఇంకా అప్పటికి ఏడాది సమయం ఉంటుంది.

అందువల్ల... మరి ఆ ఏడాది పాటూ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. లేక, వాటికి ఆ ఒక్క ఏడాదికీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు.

Tags:    
  • Jamilielections 
  • Jamilibill 
  • Loksabha 
  • Jamilielectionsbill 
  • Indiaalliance 
  • NDAAlliance 
  • BJP 
  • Congress 
  • President 
  • Politicalnews 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS