మహిళా ఎమ్మెల్యే మీద ఈ వ్యాఖ్యలేంది నల్లపరెడ్డి?

‘‘ఎవరూ దొరకనట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆయన కోరితే ఒక కన్నెపిల్లను తెచ్చి నేనే పెళ్లి చేసేవాడిని.;

Update: 2025-07-08 04:09 GMT
మహిళా ఎమ్మెల్యే మీద ఈ వ్యాఖ్యలేంది నల్లపరెడ్డి?

మర్యాద ఎక్కడికి వెళ్లింది నల్లపరెడ్డి? ఎంత రాజకీయ శత్రుత్వం ఉంటే మాత్రం.. గల్లీల్లో కూర్చొని బాధ్యత అన్నది ఇసుమంత కూడా లేనట్లుగా మాట్లాడే వారికి మించినట్లుగా మాట్లాడటమా? అందునా ఒక మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇలా కూడా మాట్లాడొచ్చా? అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం సందర్భంగా జిల్లా పార్టీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు పెను దుమారాన్నే రేపాయి. రాయలేనంత దారుణంగా ఆయన మాటల ఉన్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న సోయి లేకుండా.. మర్యాదకు వందల కిలోమీటర్ల దూరంలో ఆయన వ్యాఖ్యలున్నాయి.

కోవూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ప్రశాంతి రెడ్డిపై ఆయన నోరు పారేసుకున్నారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేత నోటి నుంచి.. బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయా? అన్నట్లుగా ఆయన తీరు ఉండటం విస్తుపోయేలా చేస్తోంది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రసంగంలో భాగంగా మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ.. రాయలేనంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు.

‘‘ఎవరూ దొరకనట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆయన కోరితే ఒక కన్నెపిల్లను తెచ్చి నేనే పెళ్లి చేసేవాడిని. పదేళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావ్? ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా. నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇప్పటికే నిన్ను చంపటానికి రెండు సిట్టింగ్ లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది’’ అంటూ నోరు పారేసుకున్న ప్రసన్నకుమార్ రెడ్డి.. తన ప్రసంగంలో భాగంగా రాయలేనంత దారుణంగా మాట్లాడారు.

ప్రభాకర్ రెడ్డి సతీమణి.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘రేణిగుంట మెస్ లో పీహెచ్ డీ నేర్చుకున్నావు. తిరుపతిలో పీహెచ్ డీ నేర్చుకున్నావు. బెంగళూరు పీహెచ్ డీ చేశావు హైదరాబాద్ లో పీహెచ్ డీ చేశావు. మద్రాసులో పీహెచ్ డీ చేశావు. చివరకు మాగుంట లేఅవుట్ లోనూ పీహెచ్ డీ చేశావు. ఆఖరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి.. బ్లాక్ మొయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు. విడిపోయిన తర్వాత తెలుసు. పక్క రాష్ట్రంలోనూ చెబుతారు. కాశీలో.. గుజరాత్ సూరత్ లోనూ ఈమె గొప్పతనం గురించి చెబుతారు’’ అని వ్యాఖ్యానించారు.

ప్రభాకర్ అన్నా.. నువ్వు నిద్రలో అయినా చనిపోతావు. బయటన్నా.. ఎక్కడో ఒకచోట లేపేస్తారు. జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు జాగ్రత్త. నీ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నువ్వు మంచివాడివని నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు. నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుకుపోయావు ప్రభాకర్ రెడ్డిగారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. అతనో పిచ్చోడు. ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడో తెలీదు. అతను అడిగి ఉంటే.. జిల్లాలో ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని’’ అంటూ నోరు పారేసుకున్నారు.

ఈ మురికి వ్యాఖ్యల అనంతరం.. సోమవారం రాత్రి నెల్లూరు నగరంలోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాత్రి ఎనిమిదిన్నర - తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేయటమే కాదు.. ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్.. కుర్చీలను విరగ్గొట్టారు. కిటికీలు పగలగొట్టారు. ఇంట్లో ఉన్న దుస్తులు బయటకు తీసుకొచ్చి తగలపెట్టారు. ఈ దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో లేరు. దాడి ఘటన జరిగిన అనంతరం.. వైసీపీ నేతలు పలువురు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి.. దాడికి టీడీపీకి చెందిన వారేనని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని డిమాండ్ చేశారు. మొత్తంగా నెల్లూరు జిల్లాలో ప్రసన్నకుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలు కొత్త ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.

Tags:    

Similar News