హాసన సెక్స్‌ కుంభకోణం.. ఎంపీ ప్రజ్వల్‌ పై జేడీఎస్ కీలక నిర్ణయం!

ఈ సమయంలో జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... తాజాగా ప్రజ్వల్‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Update: 2024-04-30 08:10 GMT

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణ తో పాటు.. మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లపై లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. పైగా ఎన్నికల సీజన్ కావడంతో వ్యవహారం మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో... హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... తాజాగా ప్రజ్వల్‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా... ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు... ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ చిన్నాన్న, మాజీ సీఎం హెచ్‌.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు సందేహాలు, ప్రశ్నలు తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అని ప్రశ్నించిన కుమారస్వామి... ఆ వీడియోలో అతడివేనన్న ఆధారం ఏంటి..? అని అడిగారు. అయినప్పటికీ నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై "సిట్‌" దర్యాప్తు చేస్తోందని గుర్తు చేస్తూ... ఆ వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌ డ్రైవ్‌ లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఎవరికి ఎలా పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News