• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కల్యాణ్ డబ్బులు,...

పవన్ కల్యాణ్ డబ్బులు, ఆస్తులపై... పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు!

| ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-04-17 09:13 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ - విపక్షాల మధ్య మాటల యుద్ధాలు తీవ్రమవుతున్నాయి. విమర్శలు - ప్రతి విమర్శలతో వాతావారణం తీవ్రంగా వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల జనసేనకు రాజినామా చేసి, వైసీపీలో చేరిన పోతిన మహేష్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ డబ్బులు, ఆస్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అవును... జనసేన పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో ఫైరయిన పోతిన మహేష్... తాజాగా ఆయన ఆస్తులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోతిన మహేష్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ సినిమాలు చేసి సంపాదించిన డబ్బు పార్టీకి ఖర్చుపెడుతున్నారని జనసైనికులు చెబుతుంటే.. డబ్బుల కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారని పోతిన మహేష్ చెప్పడంపై ప్రశ్నించారు!

దీంతో దీనికి సమాధనంగా స్పందించిన మహేష్... 2014 నుంచి 2024 వరకూ పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు ఎన్ని? ఎన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి? ఎన్ని డిజాస్టర్ అయ్యాయి? పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు... అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అని చెబుతు.. ఈ సినిమాల మొత్తానికి ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... 2014 నుంచి 2024వరకూ సినిమాల్లో ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత..? ఆయన కట్టిన ఇన్ కం ట్యాక్స్ ఎంత..? ఆయన మెయిటినెన్స్ పోగా మిగిలింది ఎంత..? ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత..? ఆయన కొన్న ఆస్తులు ఎంత..? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నారనేది బహిరంగ సత్యం అని చెబుతూ... చంద్రబాబు నుంచి, టీడీపీ నేతల నుంచి పవన్ కు డబ్బులు వస్తున్నాయనేది అంతటా చర్చ నడుస్తుందని తెలిపారు.

ఇదే క్రమంలో ఖచ్చితంగా పవన్ కల్యాణ్ కి ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికలకు ముందే బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా తాను ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. దీంతో... పోతిన మహేష్ కు తెలిసి పవన్ కల్యాణ్ 2014 - 2024 వరకూ కొన్న ఆస్తులు ఎంత అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది!

Full View
Tags:    
  • Pothinamahesh 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • APelections 
  • Pawankalyan 
  • Janasena 
  • Ndaallaince 
  • Tdp 
  • Bjp 
  • Vijayawadawest 
  • Money 
  • Movies 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS