వీడియో... బ్యాట్‌ తో కొట్టి చంపిన పోలీస్ కొడుకు!

అవును... జైపూర్ లో తాజాగా ఒక షాకింగ్ సంఘటన సంచలనం సృష్టించింది.

Update: 2024-04-04 08:02 GMT

రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా క్రైం రేటు పెరిగిపోతుందని.. మనిషి ప్రాణానికి రోజు రోజుకీ విలువ తగ్గిపోతుందని.. మనిషిలో మానవత్వం పాళ్లు రోజు రోజుకీ ఆవిరైపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పైన ప్రస్థావించిన అభిప్రాయాలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఒక యువకుడిని క్రికెట్ బ్యాట్ తో అత్యంత దారుణంగా కొట్టి చంపాడు!

అవును... జైపూర్ లో తాజాగా ఒక షాకింగ్ సంఘటన సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా... రాజస్థాన్ లోని ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కొడుకు.. ఒక యువకుడిని పట్టపగలు క్రికెట్ బ్యాట్ తో దారుణంగా కొట్టి చంపాడు! ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడి నివాసం సమీపంలో బాధితుడు తన కూరగాయల షాప్ ను ఏర్పాటు చేయడంతో ఈ వివాదం తలెత్తిందని తెలుస్తుంది!

స్థానిక రజనీ విహార్ కాలనీలో క్షితిజ్ గా గుర్తించబడిన అతడి కుమారుడు చేసిన దాడిని సమయంలో ఇన్ స్పెక్టర్ సమీపంగానే ఉన్నప్పటికీ అతడిని ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం! తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియోలో... నిందితుడు క్రికెట్ బ్యాట్ తో బాదితుడిని పదే పదే తలపై కొట్టడం కనిపించింది!

ఈ దాడి అనంతరం క్షితిజ్, అతని తండ్రి బాధితుడి మృతదేహాన్ని కారులో తరలిస్తున్నట్లు మరో ఫుటేజ్ లో కనిపించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సమయంలో... ఈ ఘటనపై స్పందించిన డీసీపీ అమిత్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృంధం.. బుధవారం క్షితిజ్ ను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు!

Read more!
Tags:    

Similar News