నేను పొలిటీషియన్ ని కాను....పవన్ బోల్డ్ స్టేట్మెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది వెండి తెర మీద ఆయనకు ఉన్న పవర్ ఫుల్ పేరు. ఆయన పేరులోనే పవర్ ఉంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది వెండి తెర మీద ఆయనకు ఉన్న పవర్ ఫుల్ పేరు. ఆయన పేరులోనే పవర్ ఉంది. ఒక వైబ్రేషన్ ఉంది. ఒక బిగ్ సౌండ్ ఉంది. ఒక సునామీ లాంటి భావోద్వేగం ఉంది. అందుకే పవన్ కి అంతా కనెక్ట్ అయిపోతారు.
ఇక సినిమా యాక్టర్ గా ఉంటూ పొలిటికల్ గా టర్న్ అయిన వారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా పవన్ సక్సెస్ అయ్యారా అయితే ఎంతవరకూ అన్న ప్రశ్నలు వస్తూంటాయి. అయితే రాజకీయాల మీద పవన్ కి ఉన్న తపన ఆసక్తి పట్టుదల వీటిని కొలమానంగా తీసుకుంటే మాత్రం ఆయన సక్సెస్ అయినట్లుగానే చెప్పాలి.
ఎందుకంటే విజయం అపజయం అన్నవి జస్ట్ మార్కుల లాంటివి. కానీ వీటిని నడిపించే అసలైన కంటెంట్ ఏంటి అంటే తాము ఎంచుకున్న రంగం మీద అమితమైన గౌరవం అభిమానం ఉండడం. అవి ఉన్న నాడు జయాపజయాలతో నిమిత్తం లేదు. పవన్ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి. రేపటి రోజున ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అయితే ఇదే సక్సెస్ రేటు, ఇలాగేనా కొలమానం వేసి చూడాలి అంటే కాదనే అంటారు చాలా మంది.
ఇక పవన్ విషయం తీసుకుంటే పదవులకు ఆయన దూరంగానే ఉంటారు. అందుకే తనకు సీఎం పదవి కోరుకోలేదు. ఏ రకమైన ఒత్తిడి పెట్టలేదు. రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు లాంటి విజనరీ సీఎం గా మరో పదిహేనేళ్ళు ఉండాలని మనస్పూర్తిగా కోరుకోవడమే కాదు అనేక సభలలో కూడా ఓపెన్ గానే చెప్పి ఉన్నారు.
మరి ఇది ఫక్తు రాజకీయ నాయకుడి లక్షణం కానే కాదు కదా. రాజకీయ నేత అంటే పదవులు అధికారం ఇదే కదా వర్తమానంలో నిర్వచనం. అందుకే పవన్ తాను పొలిటీషియన్ కాదు అని అంటున్నారు. తనను అలా పిలవవద్దు అని కూడా అంటున్నారు. మరి పవన్ ని ఎలా పిలవాలి అంటే ఆయనను సోషల్ యాక్టివిస్టుగా పిలవాలని కోరుతున్నారు. అలాగే చూడాలని ఆయన ఆశిస్తున్నారు.
సోషల్ యాక్టివిస్టు ఎపుడూ ముందు సమాజం గురించి చూస్తారు, ఆలోచిస్తారు. తాను ఉన్న సోసైటీ బాగుందా లేదా అని ఆలోచిస్తారు. సోసైటీ బాగు కోసం తనదైన శైలిలో పనిచేస్తారు. తాను ఎంచుకున్న మార్గంలో తాను చూసుకున్న రంగంలోనే ఉంటూ మంచి సమాజం కోసం పాటు పడతారు. ఇక్కడ పదవులతో పని లేదు, అధికారాల పేచీ పూచీ అంతకంటే లేదు.
అందుకే పవన్ తనను సోషల్ యాక్టివిస్టుగా చూడమనే కోరుతున్నారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్స్ చేశారు. ఇక నటుడిగా కంటే తాను రాజకీయ రంగం మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాను అని ఆయన చెప్పడమూ జరిగింది. ఇవన్నీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మాటలు ప్రకటనల మధ్య వైవిధ్యం గురించి అంతా మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తారు.
అయితే ఆయన రొటీన్ పొలిటీషియన్ కాదని ఆయనను బాగా విశ్లేషించేవారు చెప్పేమాట. ఎక్కడ మంచి ఉంటే అక్కడ దానిని ఆయన తీసుకుంటారు. ఫిలసఫీలు సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే మంచి సమాజం కోసం మనం అన్న సూత్రాన్ని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన పొలిటీషియన్ కాదు అని అంటారు. అదే మాట ఆయన అంటూ తాను సోషల్ యాక్టివిస్టుని అంటున్నారు. మరి ఈ సోషల్ యాక్టివిస్టు భవిష్యత్తు రాజకీయాల్లో ఎలా ఉంటుందో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
సాధారణంగా సోషల్ యాక్టివిస్టులు రాజకీయాల్లోకి రారు. వచ్చినా ఇమడలేరు. వారు తాము ఎంచుకున్న ఉద్యమ పంధాలోనే ముందుకు సాగుతారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సోషల్ యాక్టివిస్టుగా ఉంటున్నారు. ఒక విధంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక ప్రయోగంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.