ప‌వ‌న్ ఒక్క వార్నింగ్‌.. 'ఆ బ్యాచ్‌' కు కునుకు లేకుండా చేసిందా ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన ఒకే ఒక్క వార్నింగ్ రాయ‌ల‌సీమ‌లోని ఓ బ్యాచ్‌కు కంటిపై కును కు లేకుండా చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.;

Update: 2025-11-11 10:03 GMT

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇచ్చిన ఒకే ఒక్క వార్నింగ్ రాయ‌ల‌సీమ‌లోని ఓ బ్యాచ్‌కు కంటిపై కును కు లేకుండా చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఏపీలోని శేషాచ‌లం అడ‌వు ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎర్ర‌చంద‌నం.. వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కొన్నాళ్లుగా వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ ఎర్ర‌చందనం అక్ర‌మ ర‌వాణా, మూఠాలు క‌ట్ట‌డం వంటివి తెలిసిందే. దీనివ‌ల్ల స‌ర్కారుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ముఖ్యంగా ఇక్క‌డి నుంచి అంత‌ర్జాతీయ స్థాయిలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా సాగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాలు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న‌ది వాస్త‌వం. నిజానికి అట‌వీ శాఖ‌లో ఎర్ర చంద‌నం ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక విభాగాలు కూడా ఉన్నాయి. టాస్క్ ఫోర్సులు ప‌నిచేస్తున్నాయి. అయినా.. ఈ అక్ర‌మాల‌కు చెక్ ప‌డ‌డం లేదు. దీని వెనుక కొన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కుల పాత్ర ఉంద‌న్న‌ది అధికారులు చెప్పిన మాట‌.

దీంతో ఈ వ్య‌వ‌హారానికి ఇప్ప‌టి వ‌ర‌కు చెక్ ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ రవాణా మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా ముందుకు సాగుతోంది. ఈ ప‌రిణామాల‌కు ముకుతాడు వేసేలా.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మావోయిస్టుల‌ను ఏరివేస్తున్న `ఆప‌రేష‌న్ క‌గార్‌` మాదిరిగా.. ఎర్ర‌చంద‌నం ప‌రిర‌క్ష‌ణ‌కు తాము కూడా ఆప‌రేష‌న్ చేప‌డ‌తామ‌ని.. హెచ్చ‌రించారు. అప్ప‌టి వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని కూడా స్మ‌గ్ల‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు.

ఈ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో అనూహ్యంగా సీమలో కొంద‌రు వ్యాపార వేత్త‌ల మ‌ధ్య ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎర్ర చంద‌నం వ్యాపారం మాత్ర‌మే చేసే కొంద‌రు వ్యాపారుల‌కు.. రాజ‌కీయంగా ఉన్న సంబంధా లు బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ విష‌యంలో వారు ఇప్పుడు వ‌ణుకుతున్నార‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అయితే.. పెద్ద మొత్తంలో కొంద‌రు వ్యాపారులు పెట్టుబ‌డి పెట్టిన నేప‌థ్యం.. దీనికి రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌హ‌కారం నేప‌థ్యంలో అనూహ్యంగా ప‌వ‌న్‌ వార్నింగ్ ఇవ్వ‌డం వంటివి వారికి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News