పిఠాపురంలో పవన్ కల్యాణ్ 'రాఖీ' సర్‌ ప్రైజ్ ఇదే!

అవును... రక్షా బంధన్ సందర్భంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వితంతువు మహిళలకు ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సుమారు 1,500 చీరలను పంపించినట్లు తెలుస్తోంది.;

Update: 2025-08-10 06:52 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన మానవతా సాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే సంగతి తెలిసిందే. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆయన దానగుణం, మానవ సాయం గురించి చాలామందికి తెలిసిందే. ఆయన ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజలకు చెప్పులు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఇదే సమయంలో తన తోటలో కాచిన మామిడి పండ్లను గిరిజన ప్రజలకు పంపారు.. వారితో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని చెప్పకనే చెప్పారు. ఇక వ్యక్తిగతంగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వితంతువులకు పవన్ కల్యాణ్ రాఖీ సర్ ప్రైజ్ పంపించారు.

అవును... రక్షా బంధన్ సందర్భంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వితంతువు మహిళలకు ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సుమారు 1,500 చీరలను పంపించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వితంతువులైన మహిళలకు పవన్ తన సోదరభావాన్ని ఈ విధంగా చూపించారు! ఈ చీరలను స్థానిక జనసేన కార్యకర్తలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా... ఈ మహిళలకు తాను సోదరుడిలా అండగా నిలుస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయం వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ పై పవన్ కున్న ప్రత్యేక శ్రద్ధతో పాటు, స్థానిక ప్రజలపై ఆయనకున్న కృతజ్ఞతా భావానికి ఇది నిదర్శనం అనే మాటలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News