పవన్ ని పిలుస్తున్న మోడీ
ఇవన్నీ కూడా సహజంగా మోడీ లాంటి వారికి ఆకట్టుకుంటాయి. అందుకే మోడీ పవన్ ని రమ్మని పిలుస్తున్నారని ప్రచారం సాగుతోంది.;
జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆప్యాయంగా పిలుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నిజానికి పవన్ అంటే నరేంద్ర మోడీకి తెలియని వాత్సల్యం కలుగుతుంది. ఆయన నిండుగా నవ్వుతూ చేతులు చాచి మరీ పవన్ ని దగ్గరకు తీస్తారు. ఆ సన్నివేశం చూసిన వారికి ఎంతో హృద్యంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే పవన్ లోని నిజాయితీ నిబద్ధతను చూసి మోడీ ఎంతో మెచ్చుకుంటారు. ఈ రోజులలో పదవుల కోసం వెంపర్లాడే నేతలనే అంతా చూస్తున్నారు. దానికి పవన్ భిన్నం. కేంద్ర పెద్దలతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నా ఏ రోజూ కూడా ఏ విషయంలోనూ పవన్ వెళ్ళి అడిగింది లేదు. ఆయన కేంద్ర పెద్దల అభిమానాన్ని అలాగే ఒక పోస్ట్ డేటెడ్ చెక్ మాదిరిగానే దాచుకుంటున్నారు.
ఇవన్నీ కూడా సహజంగా మోడీ లాంటి వారికి ఆకట్టుకుంటాయి. అందుకే మోడీ పవన్ ని రమ్మని పిలుస్తున్నారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో తన మంత్రివర్గంలో పవన్ ని తీసుకోవాలని మోడీకి ఉందని అంటున్నారు బహుశా మే జూన్ నెలలలోగా తన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోడీ అనుకుంటున్నట్లుగా కధనాలు వినిపిస్తున్నాయి.
అలా మంత్రివర్గాని విస్తరించినపుడు ఏపీ నుంచి జనసేన కోటాలో ఒక బెర్త్ ని ఇస్తారు అని చెబుతున్నారు. ఆ బెర్త్ పవన్ కోసమే అని అంటున్నారు. పవన్ అంగీకరిస్తే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ నుంచి ఆయనను ముందు ఎంపీగా చేసి ఆ మీదట కేబినెట్ లోకి తీసుకుంటారు అని కధనాలు అయితే వినిపిస్తున్నాయి. అలా అయితే ఏపీ కేబినెట్ లో పవన్ కళ్యాణ్ ప్లేస్ లో నాగబాబు చేరుతారు అని కూడా అంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకోకపోతే ఆ ప్లేస్ లో బీజేపీ మనిషి వచ్చి ఎంపీ అవుతారని చెబుతున్నారు.
ఇక పవన్ ప్రభుత్వంలో చేరకపోతే మోడీ రాజకీయ కోర్ కమిటీలో అయినా సభ్యుడిగా చేర్చుకోవాలన్న పట్టుదల కూడా ఉంది అని అంటున్నారు. అలా పవన్ సేవలను దక్షిణాదిలో అందునా తమిళనాడులో పెద్ద ఎత్తున వాడుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
ఇక పవన్ వైఖరి చూస్తే ఆయన ఉప ముఖ్యమంత్రిగానే ఏపీలో ఉండడానికి ఇష్టపడతారు అని అంటున్నారు మోడీ రాజకీయ కోర్ కమిటీలో ఆయన ఉండడానికే ఓటు వేస్తారు అని అంటున్నారు. ఇక సౌత్ లో పవన్ ఇమేజ్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అన్నామలై లాంటి వారి జనాకర్షణను ఇతర కీలక నాయకుల బలాన్ని కలగలిపి రానున్న ఎన్నికల్లో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వాడుకోవాలని మోడీ రాజకీయ కోర్ కమిటీ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
మొత్తానికి ఏదో విధంగా తనతో ఉండాలని మోడీ పవన్ విషయంలో కోరుకుంటున్నారు. పవన్ మీద ఆయనకు అంత నమ్మకం అని చెబుతున్నారు మరి జనసేనాని ఓకే అంటే ఆయన జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలగడం ఖాయమే. సో ఈ ప్రచారం చూస్తే కనుక పవన్ మోడీ దృష్టిలో ఎక్కడో ఉన్నారని అందరికీ అర్ధం అవుతుంది. జనసైనికులకు అయితే ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే వార్తగా కూడా ఉంటుంది.