• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ చాక్లెట్ బాయ్ !

పవన్ చాక్లెట్ బాయ్ !

| మోడీ ఏమి మాట్లాడినా అలా వింటూ పరవశించిపోతారు. ఇది ప్రతీ వేదిక మీద కనిపించే సన్నివేశమే.

By - Tupaki Desk
Update: 2025-05-03 03:31 GMT

జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలతో ఉన్న వారు పవన్ కళ్యాణ్. అంతే కాదు ఆయన రీల్ లైఫ్ లో పవర్ స్టార్. ఆయన పేరు చెప్పగానే ఉర్రూతలూగే యువతరం కోట్లలో ఉంది పవన్ అన్న మూడు అక్షరాలు వారికి తారక మంత్రాలు. ఇక పవన్ కళ్యాణ్ లో గుర్తించతగిన విషయం పట్టుదల.

ఆయన పంతం పట్టాలే కానీ ప్రత్యర్ధి రాజకీయ అంతం చూడక మానరు. అది 2024 ఎన్నికల్లో రుజువు అయింది. ఆయనకు ఏమి తెలుసు రాజకీయం అన్న వారు అంతా చతికిలపడి పోయారు. బ్యాక్ బెంచెస్ లోకి వెళ్ళిపోయారు. అటువంటి పవన్ కళ్యాణ్ ని చూస్తే మోడీకి పుత్ర వాత్సల్యం పొంగుకు వస్తుంది.

ఆయన పవన్ ని ఆప్యాయంగా దగ్గరకు తీస్తారు. భుజం తడతారు. పవన్ రెండు చేతులనూ తీసుకుని ఆయనతో ఎంతో ప్రేమతో ముచ్చటిస్తారు. ఇలా పవన్ మోడీల బంధం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. పవన్ సైతం మోడీని చూడగానే గురు భావంతో తండ్రి పట్ల చూపించే గౌరవ భావంతో ఒదిగిపోతారు.

మోడీ ఏమి మాట్లాడినా అలా వింటూ పరవశించిపోతారు. ఇది ప్రతీ వేదిక మీద కనిపించే సన్నివేశమే. ఇక అమరావతి రాజధాని పనుల పునర్ నిర్మాణానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

అయితే పవన్ ప్రసంగం పూర్తి కాగానే తన సీటు వద్దకు వెళ్ళిపోతూంటే మోడీ ఆయనను పిలిచి మరీ చేతిలో చాక్లెట్ పెట్టారు. ఆ సన్నివేశం చూసిన వారు అంతా ఆసక్తిని ప్రదర్శించారు. మోడీ అయితే నవ్వుతూనే ఇదంతా చేశారు. పవన్ కూడా నవ్వుతూ తన సీటు వద్దకు వెళ్ళిపోయారు.

ఇంతకీ పవన్ కి చాక్లెట్ ఎందుకు మోడీ ఇచ్చారు అన్న దాని మీద సోషల్ మీడియాలో మళ్ళీ ఎవరి కామెంట్స్ వారు చేస్తున్నారు. పవన్ రాజకీయంగా ఇంకా వర్ధమాన దశలో ఉన్నారని అందుకే ఆయనకు చాక్లెట్ మోడీ ఇచ్చారని కొంతమంది దురభిమానులు విమర్శలు చేస్తూంటే మరికొంతమంది తండ్రి హృదయం తో ప్రేమగా ఇచ్చారు అని అంటున్నారు.

అయితే విషయం ఏంటి అంటే పవన్ తన ప్రసంగం చేస్తున్నపుడు దగ్గుతూ ఇబ్బంది పడ్డారు. దాంతో మోడీ ఆయన ప్రసంగం పూర్తి కాగానే చాక్లెట్ ఇచ్చి ఆయన ఇబ్బందికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదంతా తండ్రి ప్రేమతోనే చేశారు అని అంటున్నారు.

ఏది ఏమైనా మోడీ పవన్ పట్ల చూపించిన ఈ ప్రేమకు ఎవరి వ్యాఖ్యానాలు వారు చేసుకున్నా ఈ ఇద్దరి అనుబంధం మాత్రం ప్రతీ మీటింగులోనూ ఒక ఆకర్షణగానే ఉంటోంది. మోడీ నిస్వార్ధ సేవకు ఆయన కుటుంబాన్ని కాదనికి దేశానికి అంకితమైన తీరుకు పవన్ ఎప్పటికీ ఆయనకు అభిమానిగా ఉంటూ వస్తున్నారు. ఇక పవన్ రీల్ లైఫ్ లో కోట్ల సంపాదనను సైతం పక్కన పెట్టి సమాజం కోసం దేశం కోసం పనిచేయడానికి ముందుకు వచ్చిన తీరు ఆయనలో పదవీ వ్యామోహం లేకపోవడం ఇవన్నీ కూదా మోడీకి నచ్చే గుణాలుగా చెబుతారు. మొత్తానికి వీరిద్దరి బంధం చాక్లెట్ అంత ఆకర్షణీయమైనది, తీయనిది అని అంటున్నారు అంతా.

Tags:    
  • PawanKalyan 
  • ModiWithPawan 
  • Amaravati2025 
  • JanaSena 
  • TeluguPolitics 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS