ఆ లుక్ ఏంటీ సామీ.. పోలిటికల్ ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు పవన్ కళ్యాణ్.;

Update: 2026-01-06 07:51 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు పవన్ కళ్యాణ్. సినిమాల్లో ట్రెండ్‌లను మార్చిన పవన్ కళ్యాణ్‌.. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నారు. అయితే రాజకీయాల్లో ఆయన విజయం మాత్రం వెంటనే దక్కలేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, పోరాటాల తర్వాతే పవన్ రాజకీయంగా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కొత్త అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఆయన లుక్. హావభావాలు, వస్త్రధారణ, హెయిర్ స్టైల్.. అన్నింటిలోనూ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు రాజకీయ వర్గాల్లోనే కాదు.. అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.




 


సాధారణ నేత మాదిరిగానే.. కానీ ప్రత్యేకంగా!

సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన పవన్ కళ్యాణ్‌కు సహజంగానే ఒక చరిష్మాటిక్ పర్సనాలిటీ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయన ఎక్కువగా కుర్తా పైజామా, సాధారణ వస్త్రధారణలోనే కనిపించారు. మెరిసిన గడ్డం, కాస్త రఫ్ హెయిర్ స్టైల్‌తో ఒక సంప్రదాయ రాజకీయ నాయకుడి మాదిరిగానే ఆయన బయటకు వచ్చేవారు.




 


కానీ ఇటీవల మాత్రం పవన్ లుక్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. క్యాజువల్ ప్యాంట్, షర్ట్, క్లీన్ హెయిర్ స్టైల్‌తో కార్పొరేట్ ఉద్యోగి తరహా అఫీషియల్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. క్యాబినెట్ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ మీటింగ్‌లకు కూడా అదే స్టైల్‌లో హాజరవుతున్నారు. ఇది చూసి రాజకీయ వర్గాలు మాత్రమే కాదు.. సాధారణ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.




 


అన్నిచోట్ల క్రేజ్.. అదే చరిష్మ

పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు, జనసైనికులు రెండు కోణాల్లో ఫీల్ అవుతుంటారు. ఒకటి.. అభిమాన కథానాయకుడు. రెండోది ఇష్టమైన రాజకీయ నేత. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా క్రేజ్ తగ్గదు. మంత్రివర్గ సమావేశాల సందర్భంలో కూడా తోటి మంత్రులు పవన్‌తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపడం ఆయన చరిష్మకు నిదర్శనం.




 


ప్రజలతో వ్యవహరించే తీరులోనూ పవన్ ప్రత్యేకమే. చాలా అంకితభావంతో పనిచేస్తారన్న పేరు ఆయనకు ఉంది. గతంలో సాధారణ వస్త్రధారణలో కనిపించిన పవన్, ఇప్పుడు అఫీషియల్ లుక్‌తో కనిపించడం జనసైనికులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మన నాయకుడు మారుతున్నాడు.. వ్యవస్థలో తనదైన శైలిని చూపిస్తున్నాడు అనే భావన వారిలో బలపడుతోంది.

అభిమానులకు ఫిదా.. ప్రత్యర్థులకు అసహనం

పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ఏమి చేసినా ప్రత్యర్థులకు మాత్రం నచ్చదు. ఎందుకంటే ఆయన రాజకీయంగా చూపిస్తున్న ప్రభావం అలాంటిది. కానీ అభిమానులకు మాత్రం ఆయన ప్రతి కొత్త లుక్ ఓ ఫీస్ట్‌లాంటిదే. సినిమాల్లో స్టైల్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టైల్‌తో పాటు సిగ్నేచర్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్‌ది కేవలం డ్రెస్సింగ్ మార్పు కాదు. అది ఒక సంకేతం. రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం ఎలా ఉండాలన్న దానికి ఒక ఉదాహరణ. ట్రెండ్ సెట్టర్‌గా సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన ముద్ర వేస్తున్నారు.



Tags:    

Similar News