• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ సార్... మీరు ...

పవన్ సార్... మీరు గ్రేట్ సార్ !

| కేవలం 23 ఏళ్ళకే అమర లోకాలకు వెళ్ళి చరిత్రలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఆ నవ యువకుడి మరణం యువతకు ఒక స్పూర్తిగా ఉంది.

By - Tupaki Desk
Update: 2025-05-12 04:45 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆయన మనసులో ఏముందో అది బయటకు ఎలా చెబుతారో ఆయన భావోద్వేగాన్ని కూడా అలాగే పంచుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు జవాన్ మురళీ నాయక్ పాక్ తో యుద్ధం చేస్తూ అసువులు బాసారు.

కేవలం 23 ఏళ్ళకే అమర లోకాలకు వెళ్ళి చరిత్రలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఆ నవ యువకుడి మరణం యువతకు ఒక స్పూర్తిగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళారు.

ఆయన మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరు చూసిన వారికి కంట తడి పెట్టించింది. పవన్ కళ్యాణ్ తాను సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక మురళీ నాయక్ తండ్రి అయితే ఒరేయ్ మురళీ లేవరా నీకు ఎంతో ఇష్టమైన పవన్ సార్ వచ్చారురా అంటూ భౌతిక కాయం ముందు రోదించిన తీరు కూడా అందరినీ విషాదం లోకి నెట్టింది.

పవన్ అయితే మురళీ నాయక్ తండ్రిని ఓదార్చి తన భుజానికి హత్తుకుని ఎంతోగానో సేద తీర్చారు. నిజంగా ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ వ్యవహరించారు. తాను ఒక రాజకీయ పార్టీ అధినేతను అని కానీ ఉప ముఖ్యమంత్రిని అని కానీ వెండి తెర మీద పవర్ ఫుల్ స్టార్ అని కానీ ఎక్కడా పవన్ కనిపించలేదు.

కన్నీటిని తుడిచే చల్లని హస్తంగానే మారిపోయారు. వారు బాధలకు ఓదార్పు అయ్యారు. వారు గుండె కోతకు తాను ఒక మందుగా నిలిచారు. నిజంగా పవన్ ని చూస్తే పరామర్శ అంటే ఇది కదా అనిపించకమానదు. అంతే కాదు పవన్ కళ్యాణ్ తన వంతుగా వ్యక్తిగతంగా పాతిక లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడం కూడా ఆయన మనసు ఎంత వెన్నముద్ద అనడానికి మరో ఉదాహరణ. ఈ రోజులలో ఎవరు సొంత డబ్బులు తీస్తున్నారు అన్న ప్రశ్నలు ఇక్కడే వస్తున్నాయి.

ఎంత డబ్బు ఉన్నా పైసా తీయాలంటే మనసు మూలుగుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ మాత్రం ఎడమ చేయికి తెలియకుండా కుడి చేతితో ఇచ్చిన దానాలు ఎన్నో కదా అనిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఇస్తే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అందులో సగం ఇచ్చారు అంటే పవన్ మానవత్వంలో ఎంత ఎత్తుకు ఎదిగారో అర్ధం అవుతుంది.

అందుకే పవన్ ని రాజకీయ నాయకుడు అనలేరు ఆయన జనం గుండె చప్పుడు వినే మంచి మనిషి అనడమే బాగుంటుంది. ఆయనకు పదవుల మీద వ్యామోహం లేదని అందరికీ తెలుసు. అంతే కాదు ఆయన డబ్బు మీద కూడా ఏ మాత్రం ఆసక్తి ఆశ లేవు. కానీ పవన్ కి పదవులు ఉండాలి నిండుగా డబ్బులు కూడా ఉండాలి. ఎందుకంటే అవి అతని కోసం కాదు, ప్రజల కోసం. ఆపన్నుల కోసం. అందుకేనేమో పవన్ ఇ అలా వద్దన్నా పదవి ఇచ్చి ఆ దేవుడి ప్రజల కోసమే అలా ఎదుట నిలబెట్టాడు అనిపిస్తుంది. మొత్తానికి పవన్ సారూ మీరు గ్రేట్ అనాలనిపిస్తోంది తాజా సన్నివేశాలు చూసిన అందరికీ.

Tags:    
  • PawanKalyan 
  • MuraliNaik 
  • Janasena 
  • RealHero 
  • TributeToSoldiers 
  • HumanityMatters 
  • PowerStar 
  • TeluguNews 
  • Inspiration 
  • SaluteToBravehearts 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS