ప‌వ‌న్ భుజంపై బీజేపీ తుపాకీ.. త‌మిళ రాజ‌కీయం సెగ ..!

త‌మిళ‌నాడు మురుగ‌న్ సంస్థ‌.. బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ నేతృత్వంలో మ‌హానాడు నిర్వ‌హించిం ది. దీనికి హాజ‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హిందువుల విష‌యంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2025-06-23 15:17 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బీజేపీకి మ‌ధ్య ఉన్న అనుబంధం తెలిసిం దే. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన ఆయ‌న‌.. త‌ర్వాత‌.. కొన్ని నెల‌ల గ‌డువులోనే ఆయ‌న బీజేపీతో చేతులు క‌లిపారు. ఇక‌, 2024లో టీడీపీతో జ‌త‌క‌ట్టి కూట‌మి స‌ర్కారు ఏర్పాటు చేసేలా కూడా చ‌క్రం తిప్పా రు. మ‌రోవైపు.. ఢిల్లీ ఎన్నిక‌లు, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. బీజేపీ ప‌క్షాన ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌చారం చేశారు.

అంతేకాదు.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేప‌ట్టిన స‌నాత‌న దీక్ష‌లు.. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై చేసి న నిర‌స‌న‌లు వంటివి బీజేపీకి మ‌రింత చేరువ చేశాయి. అత్యంత నమ్మ‌క‌స్తుడైన మిత్రుడుగా ప‌వ‌న్‌ను మ‌లిచాయి. దీంతో ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకునేందుకు ప‌వ‌న్‌ను ఒక `ప‌వ‌నం`గా వాడు కునేందుకు క‌మ‌ల నాథులు నిర్ణ‌యించారు. తాజాగా ఆయ‌న‌ను త‌మిళ‌నాడుకు ఆహ్వానించ‌డం.. అక్క‌డ ప‌వ‌న్ కూడా బీజేపీ కి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళ‌నాడు మురుగ‌న్ సంస్థ‌.. బీజేపీ మాతృసంస్థ ఆర్ ఎస్ ఎస్ నేతృత్వంలో మ‌హానాడు నిర్వ‌హించిం ది. దీనికి హాజ‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హిందువుల విష‌యంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా త‌మిళ‌నా డు ప్ర‌భుత్వం, డీఎంకే అధినేత‌, సీఎం స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. నాస్తిక‌త్వం పేరుతో హిందువుల‌ను విమ‌ర్శిస్తున్నార‌ని.. చెప్ప‌డం ద్వారా.. హిందూ వ‌ర్గం ఓటు బ్యాంకును బీజేపీ వైపు మ‌లిచే ప్ర‌క్రియ‌లో ప‌వ‌న్ కీల‌క రోల్ పోషించార‌నే చెప్పాలి.

అంతేకాదు.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో చాలా దూర దృష్టి.. రాజ‌కీయ వ్యూహ ప్ర‌తివ్యూహాలు వంటివి స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఈ ఏడాది చివ‌రిలో త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌ర‌గనుండ‌డం.. ప్ర‌త్యేకంగా సినీ గ్లామ‌ర్ ఉన్న ప‌వ‌న్‌ను ఎంక‌రేజ్ చేయ‌డం.. ముఖ్యంగా హిందు వ‌ర్గాల‌ను త‌మవైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి బీజేపీ చేస్తున్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లోని భాగంగానే పేర్కొనాలి. అంటే.. ఒక ర‌కంగా త‌మ రాజ‌కీయ తుపాకీని.. ప‌వ‌న్ భుజంపై నుంచిపేల్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News