వారసుల ఎంట్రీపై ఆసక్తి రేపుతున్న మంత్రుల మాటలు..
గంటా శ్రీనివాస్ రావు, నారాయణ తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకున్నారు.;
పార్లమెంట్ లో ఎంపీ సుదాన్షు త్రివేది చేసిన ప్రసంగం ఒకటి బాగా వైరల్ గా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దృష్టిలో ఉంచుకొని వారసత్వం గురించి చాలా బాగా వివరించారు. భగవాన్ రాముడి ఆలయాల తర్వాత అంత ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆలయాలు హనుమంతుడివి. ద్రోణాచార్య శిశ్యులనే ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. రాముడికి లవకుశలు, ద్రోణాచార్యుడికి అశ్వత్థామ వారసులైనా వారికి పెద్దగా కీర్తి లేదు. అంటే ఈ దేశం బయలాజికల్ పరంపరను కోరుకోదని, భక్తులు, శిశ్యుల పరంపరనే గుర్తిస్తుందని చెప్పారు. ఇది చాలా వైరల్ గా మారింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారసత్వాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ వచ్చారు. దేశ వ్యాప్తంగా, బీజేపీ, ఎన్డీయే పాలన రాష్ట్రాల్లో వారసత్వం అనేది కనిపించడం లేదు.
రాజకీయాలు బాగా లేవంటున్న అమాత్యులు..
ఎన్డీయే పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలు నేడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో రాజకీయాలు తమతో ఆగిపోకుండా కొడుకులకు, కూతుళ్లకు, మనుమండ్లకు, మనుమరాండ్లకు కొనసాగుతుండేది కానీ సీన్ రివర్స్ అయ్యింది. నేడు రాజకీయాల్లోకి వచ్చేందుకు కొడుకులు ఇంట్రస్ట్ చూపుతున్నా నాయకులు మాత్రం అడ్డుకుంటున్నారు. ప్రస్తుత మంత్రుల నుంచి సీనియర్ నాయకుల వరకు వద్దనుకుంటున్నారు. ‘వద్దులే రాజకీయాలు బాగా లేవు’ అంటూ ఒక సీమ మంత్రి వ్యాఖ్యానించడం అందరినీ ఆలోచింప చేస్తుంది. సదరు మంత్రి బాబు కేబినేట్ లో కీలకంగా ఉన్నారు. ఆయనే ఇలా వ్యాఖ్యలు చేసే వరకు ప్రతి ఒక్కరి ఆలోచనలు అదేవిధంగా ఉన్నాయి.
ఇంట్రస్ట్ చూపని సీనియర్ నాయకులు..
గంటా శ్రీనివాస్ రావు, నారాయణ తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకున్నారు. కానీ నేడు కొంచెం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. నారాయణకు ఇద్దరు కుమార్తెలే.. దీంతో తన రాజకీయ వారసులుగా ఆయన సతీమణిని తీసుకచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించారు. ఆమెను కూడా కేవలం నియోజకవర్గానికే పరిమితం చేశాడు. ఇక గంట తన కుమారుడితో బిజినెస్ చేయిస్తానని గతంలోనే చెప్పారు. ఒక విజయవాడకు వస్తే బొండా ఉమా తన పిల్లలను తీసుకువద్దాం అనుకున్నారు. కానీ ఇటీవల తమ ప్రచార ఫొటోల్లో పిల్లల ఫొటోలు వేయద్దని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆదేశాలిచ్చారు. వైసీపీ విషయానికి వస్తే బొత్స తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఆయన కూడా ఇటీవల నా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని చెప్పడం ఆశ్చర్యాన్ని సంతరించుకుంది.
నాయకుల మాటల్లో ఆంతర్యం ఇదేనా..?
ఏది ఏమైనా నాయకుల్లో ఈ హఠాత్ పరిణామానికి కారణం ఏమై ఉంటుందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించుకునే వారు నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతీది పారదర్శకంగా జరుగుతోంది. దీంతో డబ్బులు కనిపించడం లేదు. పైగా వారసత్వానికి సీటు ఇచ్చేందుకు పార్టీలు ఇంట్రస్ట్ చూపడం లేదు. కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది.