• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సాయి రెడ్డి పీఆర్‌పీ.....

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

| విజయవాడలో విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP)ని ప్రారంభించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ నినాదంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2029 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పార్టీలో యువతకు 66 శాతం అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

By - Garuda Media
Update: 2026-11-11 16:41 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు, జెండా మరియు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించిన ప్ర‌సంగం ఎలా ఉన్నా.. ముఖ్య విశేషాలు మాత్రం చాలా గ‌మ్మ‌త్తుగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పేరు మరియు నినాదం. పార్టీ పూర్తి పేరు పరివర్తన రాజనీతి పార్టీ కాగా, "దేశం కోసం, ధర్మం కోసం" అనే నినాదంతో దీనిని ఏర్పాటు చేశారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఉన్న 'పీఆర్‌పీ' సంక్షిప్త నామాన్నే తన కొత్త పార్టీకి ఎంచుకోవడం విశేషం. అంతేకాదు.. నాడు చిరు.. కూడా ఇలానే సామాజిక న్యాయం పేరుతోనే రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.

జెండా ఆకృతి. పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగుల కలయికతో రూపొందించారు. జెండా మధ్యలో బంగారు వర్ణపు ధర్మచక్రం గుర్తును ఉంచారు. ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ అనుస‌రించే కాషాయ జెండాను పోలి ఉంద‌న్న మీమ్స్ ప‌డుతున్నాయి. సాయిరెడ్డి కూడా టీడీపీ, వైసీపీల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించారు త‌ప్ప‌.. ఎక్క‌డా జాతీయ పార్టీలను కార్న‌ర్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

2029 ఎన్నికల్లో పోటీ. 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఇతర పార్టీకి 'బీ టీమ్'గా ఉండబోమని తేల్చిచెప్పారు. అయితే.. కొత్త‌గా పుట్టిన పార్టీకి రెండేళ్ల‌లోనే అంత శ‌క్తిసామ‌ర్థ్యాలు ఉన్నాయా? అనేది కీల‌కం. రాష్ట్రంలో రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడటమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కానీ, సాయిరెడ్డి కుటుంబం నుంచి పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో స‌భ్యులు పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

యువతకు 66% ప్రాధాన్యత. సామాజిక న్యాయమే లక్ష్యంగా కుల, మత భేదాలకు అతీతంగా యువతకు రాజకీయా ల్లో 66 శాతం అవకాశాలు, టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. మెంటార్‌గా మాత్రమే బాధ్యతలు తీసుకుంటాన‌ని, తనకు ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి తాను కేవలం ఒక కన్వీనర్ లేదా మెంటార్‌గా మాత్రమే వ్యవహరిస్తూ, సమర్థులైన యువతను నాయకులుగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

రాష్ట్రంలోని దేవాలయాల పాలక మండళ్లు రాజకీయ నిరుద్యోగులకు ఆవాస కేంద్రాలుగా మారాయని ఆయన విమర్శించారు. దేవుడిపై నిజమైన భక్తి, విశ్వాసం ఉన్నవారికే ఆలయ కమిటీల్లో స్థానం కల్పించాలని, మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదని అభిప్రాయపడ్డారు. త‌ద్వారా ఆయ‌న బీజేపీ అజెండాను అనుస‌రిస్తారా? అని నెటిజ‌న్లు కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ కార్యకర్తలకు ఆహ్వానం. ప్రజలకు సేవ చేయాలనే నిజమైన ఆసక్తి ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి, పరివర్తన రాజనీతి పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. వైసీపీలో ఉండి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిన వారికి తాను గుర్తింపు ఇస్తాన‌ని కూడా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. ఆయ‌న వైసీపీకి గేలం వేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

Tags:    
  • vijaysaireddy 
  • parivartanarajaneethiparty 
  • prp 
  • andhrapolitics 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS