• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విద్యార్థులతో చంద్రబాబు,...

విద్యార్థులతో చంద్రబాబు, పవన్... దేశంలో తొలిసారి కీలక కార్యక్రమం!

| ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

By - Tupaki Desk
Update: 2024-12-07 08:18 GMT

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున "తల్లితండ్రులు - ఉపాధ్యాయుల సమావేశం" ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటు పేరెంట్స్ తోనూ, ఇటు పిల్లలతోనూ ముచ్చటించారు. స్కూల్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అవును... ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్ళో శనివారం నాడు "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా... బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ఎలా చదువుతున్నారు.. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మొదలైన విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లితండ్రులు కూడా తమ తమ పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయాలపై ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని.. తద్వారా మరింత మెరుగ్గా పిల్లలు విద్యలో రాణించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో నారా లోకేష్ కూడా విద్యార్థులతో ముచ్చటించారు!

ఈ సందర్భంగా.. పిల్లల ప్రోగ్రస్ కార్డులు పరిశీలించిన చంద్రబాబు.. తల్లితండ్రులు, పూర్వ విద్యార్థులు ఇచ్చిన సూచనలు, సహలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులు, తల్లితండ్రులతో కలిసి భోజనాలు చేశారు. వీటికోసం 23 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.

మరోపక్క... "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ లో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పాఠశాల తరగతి గదులను పరిశీలించిన ఆయన... అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. వారు సృష్టించిన సైన్స్ పరికరాల గురించి స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పవన్ కల్యాణ్... క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Tags:    
  • Chandrababu 
  • Pawankalyan 
  • Apstudents 
  • Naralokesh 
  • Andhrapradesh 
  • Parentsteachersmeeting 
  • Apcm 
  • Apdeputycm 
  • Bapatla 
  • Politicalnews 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS