ఒకప్పుడు సీఎం.. ఇప్పుడు ఇండిపెండెట్.. గ్యాప్ లో బీజేపీ ఎంట్రీ!

ఓడలు బండ్లవుతుంటాయి.. బండ్లు ఓడలవుతుండటం అనేది రాజకీయాల్లో అత్యంత సహజమైన విషయం అనే చెప్పాలి

Update: 2024-03-26 16:30 GMT

ఓడలు బండ్లవుతుంటాయి.. బండ్లు ఓడలవుతుండటం అనేది రాజకీయాల్లో అత్యంత సహజమైన విషయం అనే చెప్పాలి. అధికారంలో ఉంటే పరిస్థితి ఒకలా ఉంటే... అధికారం కోల్పోతే అత్యంత దారుణంగా మారిపోతుంది! ఆ సంగతి అలా ఉంటే... అన్నాడీఎంకే బహిస్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం టాపిక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండటం గమనార్హం.

అవును... ఒకప్పుడు అన్నాడీఎంకేలో బలమైన నేతగా ఉన్న పన్నీర్ సెల్వంకు.. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుందని చెప్పేవారు. అయితే.. ఆమె మరణానంతరం అన్నాడీఎంకే మూడు ముక్కలు కాకుండా పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలసికట్టుగా పనిచేశారు. అయితే తర్వాతి కాలంలో వీరి మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ సమయంలో సరైన సమయం చూసి పన్నీర్ సెల్వకు పళనిస్వామి దెబ్బకొట్టారు. ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దీంతో... పన్నీర్ సెల్వం పరిస్థితి దయణీయంగా మారిందని అంటున్నారు.

Read more!

ఈ నేపథ్యంలో.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యమంలో రామనాథపురం లోక్ సభ నుంఛి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో... ఇప్పుడు అందరి దృష్టీ రామనాథపురం నియోజకవర్గంపైనే ఉంది! సరిగ్గా ఈ సమయంలో బీజేపీ ఎంటరైంది.

ఉత్తరాధిలో చక్రం తిప్పుతున్నప్పటికీ... బీజేపీకి దక్షిణాది ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంటోన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తమిళనాట డీఎంకే ను ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా... పన్నీర్ సెల్వం కు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా... రామనాథపురం నుంచి బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో... ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ నెలకొంది!

Tags:    

Similar News