పాక్ - చైనా స్కెచ్ కు ముహూర్తం ఖరారు... పెద్ద ప్లానే!
అవును... తన అంతరిక్ష కేంద్రం టియాంగాగ్ కు పాకిస్థాన్ నుంచి వ్యోమగాములను పంపాలని.. వారికి శిక్షణ ఇవ్వాలని.. చైనా, పాకిస్తాన్ ఈ ఏడాది మార్చిలో ఒక ఒప్పందంపై సంతకం చేశాయని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) వెల్లడించింది.;
చైనా- పాకిస్థాన్ మధ్య అంతరిక్ష ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చైనా తన అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ కు మొదటి విదేశీ అతిథిగా తమ మిత్రదేశమైన పాకిస్తాన్ నుండి వ్యోమగామిని పంపాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా... పాకిస్తాన్ వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... తన అంతరిక్ష కేంద్రం టియాంగాగ్ కు పాకిస్థాన్ నుంచి వ్యోమగాములను పంపాలని.. వారికి శిక్షణ ఇవ్వాలని.. చైనా, పాకిస్తాన్ ఈ ఏడాది మార్చిలో ఒక ఒప్పందంపై సంతకం చేశాయని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) వెల్లడించింది. ఇలా.. తన సన్నిహిత మిత్రదేశానికి సహాయం చేయడానికి చైనా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది!
ఇదే సమయంలో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ లో హాజరైన కార్యక్రమంలో చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ, పాకిస్తాన్ స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సూపర్కో) పాకిస్తాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే ఒప్పందంపై సంతకం చేశాయని ప్రభుత్వ పత్రిక చైనా డైలీ కూడా నివేదించింది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది.
ఇందులో భాగంగా... పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు సంవత్సరం పాటు అంతరిక్ష రంగంలో శిక్షణ ఇవ్వనుండగా... ఆ ట్రైనింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాక్ కు చెందిన ఈ వ్యోమగాములు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకోనున్నారు. 2026లో చైనీస్ స్పేస్ స్టేషన్ వారం రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపే కార్యక్రమానికి వీళ్లను సిద్దం చేయనుంది.
ఈ క్రమంలో... ఆ పాక్ వ్యోమగాములు బయాలజీ, మెడికల్ సైన్సెస్, అప్లయిడ్ ఫిజిక్స్, ఏరోస్పేస్, ఆస్ట్రోనమీ పై పరిశోధనలు చేయనున్నారు. ఇదే సమయంలో.. మెడికల్ స్టడీస్, ఎన్విరాన్ మెంటల్ స్టడీస్, స్పేస్ టెక్నాలజీలో పాకిస్థాన్ శాస్త్రవేత్తలకు నైపుణ్యం అందించనున్నారు. ఫలితంగా.. చైనా సాయంతో అంతరిక్ష రంగంలో నైపుణ్యం సాధించి భారత్ పై నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ యత్నిస్తోందని అంటున్నారు.
కాగా... ఈ ఏడాది మే నెలలో భారతదేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో చైనాతో పాకిస్థాన్ మరో కీలక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ - చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భేటీ అనంతరం ఈ ప్రకటన వచ్చింది.