ఒవైసీ కుటుంబం మొత్తం హిందూస్థాన్ అనే పరిస్థితి తెచ్చిన బీజేపీ !
ఈ దేశంలో ఎవరు ఔనన్నా కాదన్నా మెజారిటీ హిందువులు ఉన్నారు. వంద కోట్లకు పైగా హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూత్వ నినాదం ఎపుడూ రాజకీయంగా ట్రంప్ కార్డ్ గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని బీజేపీ నిరూపించింది.;
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. బీజేపీ హిందూత్వ రాగాలకు దేశంలో రాజకీయ పార్టీలు చాలా కోరస్ గా మారిపోతున్నాయటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. హిందూత్వ పవర్ ఏంటో మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూస్తే తెలుస్తుంది. రెండు సీట్లతో ఎక్కడో పాతాళానికి పడిపోయిన పార్టీ ఈ రోజు మూడు సార్లు కేంద్రంలో అధికారం చలాయిస్తోంది అంటే కనుక హిందూత్వ స్లోగన్ స్ట్రాంగ్ గా ఎలా ఉందో అర్ధం అవుతోంది కదా. ఈ దేశంలో ఎవరు ఔనన్నా కాదన్నా మెజారిటీ హిందువులు ఉన్నారు. వంద కోట్లకు పైగా హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూత్వ నినాదం ఎపుడూ రాజకీయంగా ట్రంప్ కార్డ్ గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని బీజేపీ నిరూపించింది.
గతం నుంచి వర్తమానం దాకా :
ఒకప్పుడు ఈ దేశంలో హిందూత్వ నినాదం అంటే తప్పు. ఇపుడు అనకపోతే తప్పు. గతంలో బుజ్జగింపు రాజకీయాలు అంటూ బీజేపీ ఇతర పార్టీల మీద మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మీద విరుచుకుపడుతూ వచ్చింది. అలా బీజేపీ హిందూత్వ స్లోగన్ తోనే ఒక భారీ సెక్షన్ ని పోలరైజ్ చేసింది. అది రాజకీయంగా బీజేపీకి ఎంతో మేలు చేసింది దాంతో మొదట్లో లాజిక్కులు మాట్లాడిన వారు అంతా మెల్లగా దారి మార్చుకుంటున్నారు. ఆఖరుకు 2024 ఎన్నికలు ముగిసాక ఒక విషయం చాలా మందికి అర్థం అయింది. బీజేపీ హిందూత్వ రాగాన్ని తామూ ఆలపించకపోతే ఎక్కడ వెనకబడిపోతామో అన్నదే వారి ఆలోచనలలో తెచ్చిన మార్పు.
ఓవైసీ ఫ్యామిలీ షాకింగ్ :
ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లిం ఓట్లను టార్గెట్ చేస్తూ మజ్లిస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటుంది. పాతబస్తీ కే పరిమితం అయి దశాబ్దాలుగా ఒకే ఒక్క ఎంపీ హైదరాబాద్ లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు తప్ప ఎక్కడా విస్తరణకు నోచుకోని మజ్లీస్ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ విషయంలో బయట ఎక్కడా సక్సెస్ కాలేదు. వారికి తామే ఏకైక పార్టీగా ఉంటామన్న భరోసాను అయితే ఇవ్వలేకపోయింది. దానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దాంతో హిందూత్వ నినాదాలను ఒవైసీ ఫ్యామిలీ మొత్తం ఇపుడు చేస్తూ పొలిటికల్ గా షాకింగ్ న్యూస్ గా మారింది.
మెజారిటీ వింగ్ వైపుగా :
రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని రాజకీయాల్లో ఒక పరిభాష ఉంది. ఇక బీజేపీ రాజకీయ దూకుడు తరువాత హిందూత్వ ప్రస్థానం తరువాత లెఫ్టూ రైటూ కాదు మెజారిటీ మైనారిటీ వింగ్ అన్నది ఒకటి పొలిటికల్ గా స్థిరపడిపోతున్న ఫిలాసఫీగా సరికొత్తగా ముందుకు వస్తోంది. దాంతో మైనారిటీ వింగ్ నుంచి మెజారిటీ వింగ్ వైపుగా ఒవైసీ ఫ్యామిలీ పొలిటికల్ రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది. ఎన్నడూ వినని విధంగా ఒవైసీల నుంచి హిందూత్వ నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవి ఒకింత ఆశచర్యం కలిగిస్తున్నాయి.
హిందూస్తాన్ అంటూ ఓపెన్ గా :
ఈ రోజుకి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు పూర్తి కావస్తోంది. కానీ హిందూస్థాన్ అని భారత్ ని బలంగా పేరు పెట్టి పిలిచే స్తోమత సత్తా చాలా రాజకీయ పార్టీలు సంతరించుకోలేకపోయాయి. అదే పాకిస్థాన్ అయితే భారత్ ని హిందూస్తాన్ అని పిలుస్తుంది. ఇపుడు మజ్లిస్ అధినాయకుడు ఒవైసీల నోట హిందుస్థాన్ జిందాబాద్ అన్న నినాదాలు ఒక లెవెల్ లో వినిపిస్తున్నాయి. బహిరంగ సభలలో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అకరుద్దీన్ ఒవైసీ అలుపెరగని తీరులో హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ఇస్తున్న స్లోగన్స్ కి దిక్కులు పిక్కటిల్లుతున్నాయి నిజంగా ఇది నిజమేనా అన్నంతగా ఈ సోదరులు ఇస్తున్న నినాదాలు సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి.
అంతా బీజేపీ మహిమేనా :
రాజకీయాల్లో బీజేపీ అనుసరిస్తున్న మెజారిటీ వాదాన్ని ఇపుడు ఒవైసీ సోదరులు నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో హిందూత్వ నినాదం ఇంకా పాతబస్తీ బయట నుంచి లోపలికి బలంగా ఎప్పటికి అయినా చొచ్చుకుని వస్తుందన్న భయం కూడా వారిలో కనిపిస్తోంది అంటున్నారు. అందుకే బయట నుంచి ఆ నినాదం వినిపించే లోపుగానే తామే గట్టిగా అందుకుంటే మేలు అని భావిస్తున్నారు. రాజకీయ వ్యూహమో లేక అనివార్యమో తెలియదు కానీ ఒవైసీలు పూర్తిగా హిందూత్వ నినాదాలతో తరిస్తున్నారు. ఇది నిజంగా బీజేపీ మహిమే అని అంటున్నారు.
నాటి నుంచి నేటికి చూస్తే :
తాము నమ్ముకున్న బలమైన సిద్ధాంతంతో ఓవైసీ కుటుంబం దశాబ్దాలుగా రాజకీయంగా దర్జా చేసింది. ఏనాడు వారి నోట హిందుస్థాన్ జిందాబాద్ అన్న మాట రాలేదని అంటారు. అలాంటిది ఇపుడు భారత్ జిందాబాద్ హిందుస్థాన్ జిందాబాద్ ఐ అంటున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే అని విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే భారత్ లోని మెజారిటీ వాదానికి ఇది దృఢమైన సంకేతంగా కూడా చెబుతున్నారు. మెజారిటీ ఓటర్లున్న చోట వారంతా మెల్లగా పోలరైజ్ అవుతున్న చోట ఈ నినాదం అందుకోవడమే శరణ్యం అన్న స్థితిలోకి ఒవైసీ కుటుంబం వచ్చేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. మొత్తానికి బీజేపీ ట్రాక్ లోకి ఒవైసీలు వెళ్తున్నారా రగతం వర్తమానం నుంచి వారు భవిష్యత్తు ఆ వైపు అన్నట్లుగా చూస్తున్నారా అంటే ఆలోచించాల్సిందే.
https://youtube.com/shorts/hPJfEVo0PME?si=Eht7DePQtKX53t9i