'ఈవీఎంలు-సర్'లపై సర్వత్రా మౌనం.. రీజనేంటి?
నిన్న మొన్నటి వరకు ఈవీఎంలు-సర్(ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్)లపై ఇటు తమిళనాడు, అటు పశ్చిమ బెంగాల్, అసోం సహా కేరళలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.;
నిన్న మొన్నటి వరకు ఈవీఎంలు-సర్(ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్)లపై ఇటు తమిళనాడు, అటు పశ్చిమ బెంగాల్, అసోం సహా కేరళలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఏమైనా జరగొచ్చు.. అంటూ నాయకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. కానీ, ఎన్నికల ఫలితాలు వస్తున్న క్రమంలో ఏ ఒక్కరూ దీనిపై మాట్లాడలేదు.
రీజనేంటి?
ఎక్కడా కూడా ఏక పక్షంగా ప్రజలు తీర్పు చెప్పలేదు. పశ్చిమ బెంగాల్‌లో అందరూ ఊహించినట్టుగానే.. ఓటు బ్యాంకు ఆచితూచి పడింది. బీజేపీకి 45 శాతం ఓటు బ్యాంకు వచ్చినట్టు తెలుస్తుండగా.. 42 శాతం మంది ఓటర్లు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి ఓటేశారు. దీంతో ఈవీఎంలను తప్పుబట్టే అవకాశం లేకుండా పోయింది. అదేసమయంలో సీట్ల విషయంలోనూ ఇలానే టఫ్‌గానే సాగింది.
తమిళనాడు విషయానికి వస్తే.. అసలు గెలుస్తారా లేదా అనుకున్న టీవీకే విజయం దక్కించుకున్నా.. హంగ్ ఏర్పడే అవకాశం ఏర్పడింది. అంటే.. ఈవీఎంలపై ఎవరూ అపవాదులు వేసే అవకాశం లేకుండా పోయింది. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే విషయంలో తడబడ్డారన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఎవరికీ ఏ కపక్షంగా విజయం దక్కలేదు.
కేరళంలో మాత్రమే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకునేదిశగా దూసుకుపోయింది.అయితే.. ఇక్కడ ఎల్‌డీఎఫ్ ఆది నుంచి కూడా ఈవీఎంలపై ఎలాంటివిమర్శలు చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా పార్టీ ఓడిపోయినా.. ప్రజల తీర్పును గౌరవిస్తామనే చెబుతుండడం గమనార్హం. అంతేకాదు.. సీఎం పినరయి విజయన్.. ఫలితాలు ఒకరోజు ముందే ఆదివారం తన ఓటమిని అంగీకరించి.. పేరు కింద `సీఎం`ను తొలగించారు.
అసోంలో బీజేపీ అధికారం ఖాయమనేనని తెలిసినా.. ఇక్కడ కూడా ఏకపక్షంగా ఏమీ జరగలేదు. దీంతో ఇక్కడ కూడా ఈవీఎంలను ఏమీ అనే పరిస్థితి కనిపించలేదు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. బీజేపీకి 101 స్థానాల్లోను, కాంగ్రెస్‌ను 23 స్థానాల్లోనూ గెలిపించారు. ఇక, పుదుచ్చేరిలోనూ ఈవీఎంలు, సర్ ప్రక్రియను తప్పుబట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా.. గతంలో వచ్చిన విమర్శలు తాజా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం.. వినిపించకపోవడం గమనార్హం.