• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ లో 118 పోస్టులు...

పాక్ లో 118 పోస్టులు ధ్వంసం.. అమిత్ షా ఆసక్తికర విషయాలు!

| అవును.. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

By - Tupaki Desk
Update: 2025-05-30 12:34 GMT

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఉగ్ర శిబిరాలతోపాటు పాక్ సైనిక స్థావరాలనూ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పాకిస్థాన్ సైన్యాన్ని ఎలా వణికించింది.. సరిహద్దుల్లో ఉన్న ఆ దేశ సైనిక పోస్టులను ఎలా ధ్వంసం చేసిందనే విషయాలను అమిత్ షా తాజాగా వెల్లడించారు.

అవును.. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జమ్మూలో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇలా జమ్మూకశ్మీర్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇటీవల పాక్ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఎస్ఎఫ్ దళాలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కిఏంద్ర హోంమంత్రి... ఇటీవల పాకిస్థాన్ లోని ఉగ్రస్థవరాలే లక్ష్యంగా మనం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రతిస్పందనగా దాయాదీ సైన్యం మన సరిహద్దుల్లోని పౌరులపై దాడులు చేసిందని.. అయితే, వీటిని బీ.ఎస్.ఎఫ్. దళాలు దీటుగా తిప్పికొట్టాయని.. ఈ క్రమంలో 118 పాక్ పోస్టులను ధ్వంసం చేశాయని అన్నారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం... భారత త్రివిధ దళాల అసమాన ప్రతిభ వల్లే పాకిస్థాన్ పై చేసిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయ్యిందని.. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు అమిత్ షా. ఈ సమయలో.. మనం కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశామని, ప్రజల జోలికి వెళ్లలేదని.. అయితే.. పాక్ మాత్రం మన జనావాసాలపై దాడులకు పాల్పడిందని తెలిపారు.

ఇదే సమయంలో.. శత్రువుల నిఘా వ్యవస్థను ఒక్కొక్కటిగా కూల్చివేశాయని.. ఇప్పుడు వాటికి పాక్ తిరిగి పునరుద్ధరించుకునేందుకు సుమారు నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫలితంగా.. కొంతకాలం పాటు పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో శత్రువు లేదని అమిత్ షా తెలిపారు. ఈ నేపథ్యంలొనే బీ.ఎస్.ఎఫ్. సంసిద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఇక.. ఇటీవల పాక్ జరిపిన దాడుల సందర్భంగా నష్టపోయిన కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా... ఆ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన పరిహారాన్ని కేంద్రం త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు మాట్లాడారు.

Tags:    
  • Operationsindoor 
  • IndiaStrikesBack 
  • BSF 
  • IndianArmy 
  • JammuAndKashmir 
  • PakistanTerrorism 
  • AmitShah 
  • IndiaSecurity 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS