• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చరిత్రలో పాక్ మర్చిపోలేని...

చరిత్రలో పాక్ మర్చిపోలేని కాళరాత్రి.. ‘మే 8’

| తన పరిమితుల్ని మర్చిపోయి.. తనను తాను ఓ పెద్ద సూపర్ పవర్ గా ఫీలయ్యే పాకిస్తాన్.. ఉగ్రవాదులు చెప్పిన డైరెక్షన్ లో నడిచి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న పరిస్థితి.

By - Tupaki Desk
Update: 2025-05-09 03:43 GMT

కదిలించుకొని మరీ కొట్టించుకునే మూర్ఖత్వం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇలాంటి తప్పులు వ్యక్తులు చేయొచ్చు కానీ ఏ దేశం చేయకూడదు. కానీ.. ఆ దారుణ తప్పును చేసేసింది పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్.. ఆ తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోలేదు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత అయినా.. తన తీరును మార్చుకోలేదు. తన పరిమితుల్ని మర్చిపోయి.. తనను తాను ఓ పెద్ద సూపర్ పవర్ గా ఫీలయ్యే పాకిస్తాన్.. ఉగ్రవాదులు చెప్పిన డైరెక్షన్ లో నడిచి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న పరిస్థితి.

గురువారం రాత్రి భారత్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్.. రాజస్థాన్.. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి డ్రోన్ దాడులు..వైమానిక దాడులకు తెగబడటం ద్వారా.. లక్షణ రేఖను పూర్తిగా దాటేసింది. పాక్ కుయుక్తులకు చెక్ పెట్టేందుకు పక్కాగా సిద్దమైన భారత్.. ఎక్కడికక్కడ తమపై జరిగే దాడులకు తగిన రీతిలో బుద్ది చెప్పటమే కాదు.. వారి ప్రయత్నాల్ని నిలువరించింది.

అదే సమయంలో.. పాక్ దాడుల్ని తిప్పి కొట్టటమే కాదు.. పాక్ ను అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమానికి తెర తీసింది. కాళరాత్రి అన్న మాటకు అర్థం ఎలా ఉంటుందన్న విషయాన్ని పాక్ కు అర్థమయ్యే రీతిలో భారత సైన్యం.. చేతల్లో చేసి చూపించింది. కయ్యానికి కాలుదువ్వి మరీ కాళరాత్రిని కొని తెచ్చుకున్న పాకిస్తాన్.. మరెప్పుడూ మర్చిపోలేని రోజుగా మే 8 నిలుస్తుందని చెప్పాలి. ఓవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్సు.. మరోవైపు నావికాదళం చేపట్టిన చర్యలకు పాకిస్తాన్ చిగురుటాకు మాదిరి వణికిపోయిన పరిస్థితి. పాక్ లోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి చోటు చేసుకోవటమే కాదు.. చివరకు పాక్ ప్రధానిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన దుస్థితి.

మరోవైపు కరాచీ నౌకాశ్రయంలో భారీ విధ్వంసమే చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. భారత్ గగనతనంలోకి చొచ్చుకొచ్చిన యుద్ధ విమానాలకు సంబంధించి.. ఒక యుద్ధ పైలెట్ ను అదుపులోకి తీసుకోవటం ద్వారా.. పాక్ దుర్మార్గాల్ని ప్రపంచానికి చాటి చెప్పే చక్కటి అవకాశంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు పాక్ లో నెలకొన్నట్లుగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పాక్ పతనమైతే.. అందుకు ‘మే 8’ కారణంగా మారుతుందని చెప్పక తప్పదు.

Tags:    
  • OperationSindoor 
  • IndiaStrikesBack 
  • May8 
  • PakViolations 
  • IndianAirForce 
  • IndianNavy 
  • NationalSecurity 
  • IndiaStrong 
  • CounterTerrorism 
  • IndiaStrikePOK 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 
  • IndianAirforce 
  • IndianArmy 
  • MissileStrike 
  • POKTerroristCamps 
  • IndianStrike 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS