• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రత్యక్ష పర్యవేక్షణ.....

ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఆపరేషన్ సిందూర్ వేళ మోడీ మార్క్!

| పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేయటం.. ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగిసే వరకు మోడీ ప్రత్యక్షంగా అన్ని విభాగాలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-05-07 04:04 GMT

పహల్గాం ఉగ్రదాడులపై స్పందించిన ప్రధానమంత్రి మోడీ.. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన వారు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టమని.. వారు మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తామని చెప్పటం తెలుసు. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటల వేళలో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లుగా చెబుతున్నారు.

పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేయటం.. ఆ ఆపరేషన్ విజయవంతంగా ముగిసే వరకు మోడీ ప్రత్యక్షంగా అన్ని విభాగాలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై తాము చేసిన మెరుపుదాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లుగా అమెరికా.. రష్యా.. యూకే.. సౌదీ అరేబియా.. యూఏఈకి సమాచారం అందించారు.

ఆపరేషన్ సిందూర్ పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు.. ఆర్థిక.. సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసిన భారత్.. అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ మాట్లాడారు. ఇదిలా ఉండగా.. మెరుపు దాడుల అనంతరం పాక్ సైన్యం భారత్ సరిహద్దుల్లో కాల్పుల తీవ్రతను పెంచింది. దీనికి బదులుగా భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సరిహద్దు నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులు మరణించినట్లుగా వెల్లడైంది. అమాయక ప్రజల్ని పాక్ బలి తీసుకుందన్న భారత సైన్యం.. అందుకు బదులు తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

Tags:    
  • OperationSindoor 
  • IndiaStrikePOK 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 
  • IndianNavy 
  • IndianAirforce 
  • IndianArmy 
  • MissileStrike 
  • POKTerroristCamps 
  • IndianStrike 
  • PMModi 
  • IndiaStrikesBack 
  • PahalgamAttack 
  • AjitDoval 
  • SurgicalStrike 
  • NationalSecurity 
  • PakistanTerror 
  • JaiHind 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS